కృష్ణమ్మ పెన్నమ్మ
చిత్రం : వజ్రాయుధం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
కృష్ణమ్మ, పెన్నమ్మ పెనవేసుకున్నట్టు పెదవుల్ని కలిపెయ్యనా
గోదారి, కావేరి ముద్దాడుకున్నట్టు కొంగుల్ని ముడివెయ్యనా
అలలై చెలించనా... కళలే వరించనా
నీలో పొంగేటి అందాల సందిళ్ళలో..
గంగమ్మ, యమునమ్మ కలబోసుకున్నట్టు కౌగిళ్లు తడిపెయ్యనా
తుంగమ్మ, భద్రమ్మ ఒడి చేరుకున్నట్టు ఒళ్ళంతా తడిమెయ్యనా
నదినై చెలించనా... మదిలో వసించనా
చరణం 1 :
తళుకు బెళుకులొలుకు కలికిచిలుక నడకలో
కడవకైన ఎడములేని తొడిమ నడుములో
వయసు అలా.. సొగసు కళా రేగుతున్నవీ
మనసుపడి మరుని ఒడి చేరుతున్నవీ
వలపు తీరా వంశధార పిలుపు వినిపించే నా గుండెలో
వాగు-వంక సాగేదాకా జరిగే ఈ సంబరం
చరణం 2 :
అలలు తగిలి శిలలు పలుకు శిల్పవీణలో
నదుల ఎదను నటనమాడు చిలిపిమువ్వలో
కౌగిలితో స్వాగతమే పలుకుతున్నది
కామునితో కాపురమే అడుగుతున్నది
కిన్నెరసాని కిలకిలలన్నీ సిగను చేరాయి సిరిమల్లెలై
కడలి నదులు కలిసే దాకా సాగే ఈ సంగమం