అద్దంకి చీరలో..
చిత్రం: వజ్రాయుధం (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, సుశీల
పల్లవి:
అహ అహ అద్దంకి చీరలో..
ముద్దంటి చిన్నది..
అరె అద్దంకి చీరలో..
ముద్దంటి చిన్నది..
అద్దాల రైకలో ఎదురొస్తుంటే
దానిమ్మచెక్క పులుపెక్కెనే..
ఓ యమ్మ తిక్క తలకెక్కెనే..
అరెరె అద్దంకి వాడలో..
ముద్దొచ్చే పిల్లడు..
అద్దంకి వాడలో..
ముద్దొచ్చే పిల్లడు..
వద్దన్నా వయసులా వచ్చేస్తుంటే..
ఆ నింగి చుక్క ఎరుపెక్కెనే..
చరణం 1:
హ హా..
ఆ రైక ఇరుకులూ చూడ సోకూ
ఆ కోక సరుకులూ తాక సోకూ
గోదారి గట్టులా..
ఆ చీర కట్టులో ..
ఉప్పెంగే కెరటాల ఊపు సొకూ..
ఇరుకైనా కౌగిలే ఇల్లు నాకు
వరసైనా నీ ఒడే వళ్లు నాకు
నీ ముద్దు లేనిదే..
నా పొద్దు పొదులే ..
ఆపొద్దు నీ ముద్దే ముడుపు నాకూ
వద్దనకే వొళ్లంతా వయ్యారమ్మో..
పొద్దనక రేయనక పొందాలమ్మో..
కొంగు కట్టు తాకగానే
కొత్త ఈడు పుట్టి చిచ్చుపెట్టిందమ్మో..
చరణం 2:
నీలాటి రేవులో నీడ సోకు
నీ లాంటి వాడితో ఆడ సోకూ
నా కంటిపాపను
నువ్వొచ్చి లేపకు
కడవల్లే కౌగిట్లో వొదుగు నాకూ..
ఆ పైటజారుడు చూడ సోకు
జారనిచ్చి సర్ధుడు జాణ సోకూ
ఆ పాలవెల్లులా..
మురిపాలజల్లులో ..
తాపాలు పుడుతుంటే తడవ సోకూ
పెదవి సోకినప్పుడే పెళ్లిళ్ళయ్యో
ఎదలు కలిపినప్పుడే వెన్నెల్లయ్యో..
నువ్వు నన్ను చూడగానే
వువ్వు మీద తుమ్మె దొచ్చి వాలేనమ్మో..