గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
నా ఇల్లు (1953)
సంగీతం: చిత్తూరు వి. నాగయ్య, ఏ. రామారావు
గానం: గానసరస్వతి బృందం
రచన: దేవులపల్లి
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
వచ్చేనమ్మా సంక్రాతి
పచ్చని వాకిట చేమంతి
వచ్చేనమ్మా సంక్రాతి
పచ్చని వాకిట చేమంతి
ముంగిట రంగుల ముగ్గుల్లో
ముద్దాబంతి మొగ్గల్లో
ముద్దియలుంచే గొబ్బిళ్ళో
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
ఊగే జనపా చేలల్లో
తూగే శెనగా పూలల్లో
ఊగే జనపా చేలల్లో
తూగే శెనగా పూలల్లో
గాలిదారిలో కంఠాలెత్తి కాపులు పిలిచేరో
పొలియో ఓ పొలియో
ఓ....
పొలియో...పొలియో...
పైరగాలికీ పళ్ళికలెత్తీ పడుచులు నిలిచేరో
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
దోసిళ్ళో దోసిళ్ళో
భోగిపళ్ళ దోసిళ్ళో
రేగుపళ్ళ దోసిళ్ళో
కడియాలందెల సందడితో
గలగల గాజుల సవ్వడితో
పేరంటాళ్ళ దోసిళ్ళో
బోసినవ్వుల పాపల్లో
భోగిపళ్ళ దోసిళ్ళో
రేగుపళ్ళ దోసిళ్ళో
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...
పచ్చని పండుగ వాకిళ్ళో
అరవిచ్చిన వలపుల పోకిళ్ళో
డూ డూ డూ డూ డూ డూ బసవన్న
ఆడుబిడ్డలకు దణ్ణం పెట్టు
అల్లుడుగారికి దణ్ణం పెట్టు
కొత్త పెళ్ళికూతుళ్ళో
కోరచూపుల అల్లుళ్ళో
వచ్చేనమ్మా సంక్రాతి
పచ్చని వాకిట చేమంతి
గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళో...