రింగూ రింగూల జుట్టూదానా

ప్రయివేటు సాంగ్ 
రచన: సురేష్ గంగుల, దేవ్ పవార్ 
గానం: రాము రాథోడ్, ప్రభ 
సంగీతం: కళ్యాణ్ కీస్ 

రింగూ రింగూల జుట్టూదానా
రంగూ రంగూల బొట్టూదానా
రింగూ రింగూల జుట్టూదానా
రంగూ రంగూల బొట్టూదానా

నాతో వస్తావా నాతో వస్తావా 
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

చెంగూ చెంగూన దుంకేటోడా
చెమ్కీ చెమ్కీలా చూపులోడా
చెంగూ చెంగూన దుంకేటోడా
చెమ్కీ చెమ్కీలా చూపులోడా

నీతో వస్తాలే నీతో వస్తాలే
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు

నేను గాలిగోపురం

మనసున్న మారాజు (2000)
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయణ్, అనూరాధ పౌడ్వాల్
టిప్పు (హమ్మింగ్)

పల్లవి:
  
నేను గాలిగోపురం 
నీవు ప్రేమపావురం
వచ్చీ వాలే ఈ క్షణం
 
నేను తెల్లకాగితం 
నీవు తేనె సంతకం
కోరుకున్న ఈ దినం 

ప్రేమకు దేవత నీవని తెలిసి
నా మది నీకొక కోవెల చేసా
ఓ ప్రియా.....
ఓ ప్రియా... ఓ ప్రియా..ఆ
నేను గాలిగోపురం 

వైరల్ వయ్యారి

చిత్రం: జూనియర్ (2025)
గానం: దేవిశ్రీ ప్రసాద్, హరిప్రియ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రచన: కల్యాణచక్రవర్తి త్రిపురనేని 

పల్లవి :  

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు
చూశావంటే మైండ్‌ బ్లోయింగు

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఫాలోవర్సందరికి నేనే డార్లింగు
నేనేమి చేసినా ఫుల్‌ ట్రెండింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఎయ్ నా పోస్ట్‌ టేస్టేమో యమ్మా టెంప్టింగు
ఎప్పుడొస్తాదంటూ యూత్‌ అంతా వెయిటింగు
వై వై వై వై వై వై వైరల్
అప్లోడ్‌ చేసాక డౌన్‌లోడ్‌ కోసం
చిన్నాపెద్దా తేడా లేక అంతా ఫైటింగు
వై వై వై వై వై వయ్యారి...

దట్స్‌ వై వై వై వై
వై వై వై ఐ యామ్‌ వైరల్‌ వయ్యారి

వైరల్‌ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే
వైరల్‌ వయ్యారి నేనే
వయసొచ్చిన అణుబాంబునే

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

పోత పోత పైసలన్ని

పోత పోత పైసలన్ని
తెలుగు ర్యాప్ సాంగ్ (2025)
దశగ్రీవ ట్రూప్ 

ఓ మై గాడ్... క్లామీ ...
అరె 
ఎవరేం చేస్తారో చెయ్యనీ
నాకుంది భేటే నా పని
నా పాట గుంజేస్తది నీ ఆత్మని
ఒక్క లైన్‌తోని దింపేస్తా బాధని 

హే హే 
ధోఖ ఇస్తే ఒద్లేయాలె దోస్తుని 
మత్లబ్‌లా చేస్తున్నరు నాకాని 
పోవలంటె ముందుకు ఇడ్షవెట్టరా పాస్ట్‌ని 
మీరు ఇంకా ఛోటబచ్ఛా నేను మాస్టర్‌ని 

గోల్డెన్ స్పారో

జాబిలమ్మ నీకు అంత కోపమా (2025)
గానం: అస్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుబ్లాషిని 
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్ 
సాహిత్య: రాంబాబు గోసాల 

వాకింగ్ స్లోమో...
మనసులో శోకం

హేయ్ మై గోల్డెన్ స్పారో

హేయ్.. హేయ్..
మామా.. మామా 
కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు భాజా పీపీ డుండుం
మెళ్ళో మాలతొ పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో 
నా గుండెలో యారో
నువ్వులేని లైఫు 
హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జారో
అబ్బ మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

కపుల్ కపుల్ గోల్-లు
నే సింగిల్ గున్న గర్ల్-లు

హేయ్ .. 
సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు
హేయ్.. 
చక్కని చుక్కని నేను 
ఒక్క చూపుతో పడేస్తాను
హేయ్ 
టెక్కుల ట్రిక్కుల జాను
నే మిలమిల మూను

గోల్డెన్ స్పారో 
నా గుండెలో యారో
నువ్వులేని లైఫు 
హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జారో
అబ్బ మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

అట్టు అట్టు పెసరట్టు

చిత్రం: శాంత (1961)
గానం: స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు
సంగీతం: రమేష్ నాయుడు 
రచన: కొసరాజు

పల్లవి : 

అట్టు అట్టు పెసరట్టు 
అ ఉల్లిపాయ పెసరట్టు 
ఉప్మాతో జతపెట్టు 
భల్ చెట్నీతోటి కలేసికొట్టు  
అట్టు అట్టు పెసరట్టు 
అహ ఉల్లిపాయ పెసరట్టు

నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా

ఆనిమల్ (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
గానం: సోనూ నిగమ్ 
ఆర్. పి. కృష్ణాంగ్ (చైల్డ్ వెర్షన్)
రచన: అనంత శ్రీరామ్

పల్లవి:

నా సూర్యుడివి 
నా చంద్రుడివి
నా దేవుడివీ నువ్వే

నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే

నువ్వే కదా 
నువ్వే కదా
సితార నా కలకీ

నాన్నా నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట

నిజాన్నిలా అనేదేలా
ఇవ్వాళ నీ ఎదుటా

దారిపొంటత్తుండు

దారిపొంటత్తుండు
తెలంగాణా జానపదం
సంగీతం: ఎస్ కే మదీన్ 
సాహిత్యం: మామిడి మౌనిక 
గాయని: మామిడి మౌనిక 

పల్లవి: 

ఆహా 
దారిపొంటత్తుండు 
దవ్వ దవ్వొత్తుండు
దారిద్దునా వోనిద్దునా
జోరు మీదొత్తుండు 
కారు మీదొత్తుండు
తోలేద్దునా పోనీ ఊకుందునా

దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు వోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుతుండు 
నా ముందుటుంటుండు
సందిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంట పోతాండు 
అనుకుంట వత్తాండు
బందైదునా 
బంధమై చూపనా

జగదీశ్వరా పాహి పరమేశ్వరా...

చిత్రం: సువర్ణసుందరి(1957)
సంగీతం: ఆదినారాయణరావ్
రచన: సముద్రాల
గానం: జిక్కి, కోరస్

పల్లవి :  

ఓం...
నమశ్శివాయః సిద్ధం నమః 
ఓం... 
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
హిమగిరిదేవర
శశిధరశేఖర 
నిన్నే శరణంటిరా 
నీవే గతియంటిరా
ఓ...

రామదాసు దేవదాసు హరికథ

రామదాసు దేవదాసుల హరికథ 
(నూతన్ ప్రసాద్)
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: కోపెల్ల శివరాం, ఎమ్వీయల్  
నేపథ్యగానం: బాలు

సీ మద్రమారమణ గోవిందో హా...రి 
భక్తులారా కామందులారాయ్ 
మరీ ఏటీ 
మన్నుతిన్న పాముల్లా 
మందుకొట్టిన సాముల్లా ఉన్నారు 
మత్తూ నిద్రమత్తూ వదిలేసి 
మళ్ళీ ఒకసారి 
ఏదీ 
నాయనా ఆర్మనీ 
సుతిచేసుకో నాయనా 
సుతుంటే మనిషి మనిషవుతాడు 
మంచోడే అవుతాడు 
సుతితప్పిన మడిసి పశువవుతాడు 
మతిలేనోడవుతాడు 
అదేనయ్యా నేను చెప్పే హరికథ   
సీ మద్రమారమణ గోవిందో హారి