కార్మికుల బుఱ్ఱకథ
చిత్రం: కథానాయకురాలు (1970)
సంగీతం: ఆకుల అప్పలరాజ్
రచన: సుంకర సత్యనారాయణ
గానం: సుశీల & బృందం
తక తా తకిటతక, తరికిట, తరికిట తా
కార్మిక సోదర ప్రజలారా ఓ కష్టజీవులారా!
వంత: వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
కార్మికులోడ్చే చెమటకు ఖరీదు కట్టువాడు లేడు
వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
అందరు కలిసి చేసే పనికొక అందమున్నదోయి
ఓహో
కొందరి సౌఖ్యానికి చేసే పని ఘోరనరకమోయి
అయ్యా ఘోరనరక మోయి
మోసగించబడి కాసుకులోబడి (తందాన తందానె తందాన)
ఇన్ని నీళ్ళు సేవించి బుర్ర చెడి (తందాన తందానె తందాన)
మనలో మనకే కలతలు పెంచీ (తందాన తందానె తందన)
అయిన వాళ్ళకే హాని జేసెడి (తందాన తందానె తందాన)
దిక్కుమాలిన బ్రతుకది ఎందుకు ముక్కు మూసుకోరా
ఓయ్ వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
తరిగిట ఝంతరి తా...
అనయము, రక్తము చెమటగ మారిచి పనులు చేసినామూ
తందానో తందాన ఓ దేవనందనాన!
మన శ్రమ ఫలితము తిని తెగబలిసిన ఘనుడీ యజమానీ
తందానో తందాన ఓ దేవనందనాన!
కూడబెట్టి ధనరాసులు పేదల కొంపలు దిగమ్రింగీ
తందానో తందాన ఓ దేవనందనాన!
మేడలు మిద్దెలు కట్టినాడు ఏ నీడలేదు మనకూ
తందానో తందాన ఓ దేవనందనాన!
కాకికి గూడొకటున్నదీ
సై ...
నీకది కూడా లేదుర
సై...
ఆకలి మంటలు అధికము
సై...
అన్నము మాత్రము శూన్యము
సై...
మానరక్షణకు జానెడూ
మనకు గుడ్డ లేదీనాడూ!
భళానంటి భాయి తమ్ముడా
అయ్యయ్యో
మేలు భళానోయి దాదానా
ఎంతకాలమీ పాడుబ్రతుకులింకెందుకు లేవోయీ
వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
మంతనాలతో పని బరగదు దుర్మార్గుడు యజమానీ
వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
ధనబలంబుతో మనల జయించగ తలచెను కామందూ
వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
మనమొక కట్టగ నిలచి చూపవలె జనబలమీనాడూ
వినరా కార్మిక వీరకుమార! విజయము మనదేరా
ఏయ్ కట్టు, కట్టు నడుము కట్టు
భళిభళి
కట్టి నీతెగువ చూపెట్లు
భళిభళి
కలిసి వైరుల మట్టుబెట్టు
భళిభళి
కార్మికుల శక్తి చూపెట్టు
భళిభళి
నీ కష్ట ఫలితంబు నీకు దక్కేవరకు నిలిచి రంగాన పోరాడు
ఓ కూలి యువకుడా ఓ వీరయోధుడా లేవయ్యా లేచిరావయ్యా॥
ఓ కూలి యువకుడా ఓ వీరయోధుడా లేవయ్యా లేచిరావయ్యా॥
లేవయ్యా లేచిరావయ్యా॥
లేవయ్యా లేచిరావయ్యా॥
No comments:
Post a Comment
Leave your comments