చిత్రం: సువర్ణసుందరి(1957)
సంగీతం: ఆదినారాయణరావ్
రచన: సముద్రాల
గానం: జిక్కి, కోరస్
పల్లవి :
ఓం...
నమశ్శివాయః సిద్ధం నమః
ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
హిమగిరిదేవర
శశిధరశేఖర
నిన్నే శరణంటిరా
నీవే గతియంటిరా
ఓ...
చరణం 1:
భోగింతురా...
పూజ గావింతురా
భక్తి సేవింతురా
భోగింతురా...
పూజ గావింతురా
భక్తి సేవింతురా
వరమియ్యరా
మమ్ము కరుణించరా
మమ్ము కరుణించరా
నీదు చరణాలే నెరనమ్మి యున్నామురా
నమ్ముకున్నామురా
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
చరణం 2:
రాగము మీర
భోగము చెయ్‌రా
సాగును నీ నటనా
భోగులకు సుఖసారముగా
శివయోగులకు శృతికారముగా
చరణం 3:
మధుర మధురతర మంజుల
వీణానాదము జగమూగించగా
లయ రేగగ తలలూగించగా
తధిమిధిమికి తకతయ్యని
గిరిజాసుందరి నిను కవ్వించగా
సురప్రేమను ఆనందించగా
కనివిని ఎరుగని సుఖడోలలా తూగాడగా
కనివిని ఎరుగని సుఖడోలలా తూగాడగా