Showing posts with label ప్రభ. Show all posts
Showing posts with label ప్రభ. Show all posts

నిమ్మతోట వనములో

తెలంగాణా జానపదం (2024)
సాహిత్యం: లావణ్య రవీందర్ 
సంగీతం: వెంకట్ అజ్మీరా 
గానం: ప్రభ 

పల్లవి : 

నిమ్మతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి

ముత్యాలదండలిత్తవ 
మురిపెంగ నన్ను చూత్తవా
ముత్యాలదండలిత్తవ 
మురిపెంగ నన్ను చూత్తవా

నిమ్మతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి

నీ మెడలా నా మెడల

నీ మెడలా నా మెడల
ఎల్లమ్మ పాట
సంగీతం, సాహిత్యం: దిలీప్ దేవగణ్ 
గానం: ప్రభ 

అరె...
నీ మెడలా నా మెడల నిమ్మలదండ 
నిమ నిమ్మలదండ 
అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ....
అరెరె
నీ మెడలా నా మెడల నిమ్మలదండ 
నిమ నిమ్మలదండ 
అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ....

డోలు డప్పూలు దెచ్చి 
యాటా పిల్లాలు దెచ్చి  
కోడీపుంజూలు దెచ్చి  
కొత్తా బట్టాలు దెచ్చి  
కల్లు జాకాలు దెచ్చి  
గొర్రెపోతుల నువ్వే 
కావుపట్టరావురా 
అరె ఉఫ్ ....
పచ్చి గుండా బోనమే పోచమ్మ
గజ్జెలగావూలాటలే మైసమ్మ
పచ్చి గుండా బోనమే పోచమ్మ
గజ్జెలగావూలాటలే మైసమ్మ
అరె అరె నీ మెడలా నా మెడల

నా పేరే ఎల్లమ్మ

తెలంగాణా అమ్మవారి పాట 
డీజీ లింగా
సాహిత్యం: రాజేందర్ కొండా 
గాయని: ప్రభ 
సంగీతం: మదీన్ ఎస్కె 

నా పేరే ఎల్లమ్మ 
నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా 
నన్ను జోలాజోలంటి…
ఆరుగంపల్లా 
నేను ఆడినదాన్నమ్మో …
అందరి ముంగట 
నేను అమ్మవారునే…
కలియుగములోన 
కన్నెమాతానంటిరే…
ఎయ్యో యాపశెట్టంటి 
నాకు ఇంపుగాయెనే…
నా పేరే ఎల్లమ్మ 
నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా 
నన్ను జోలాజోలంటి…

అబ్బబ్బ పోరడు ఏమున్నడే

తెలంగాణా జానపదం 
సాహిత్యం, గాయకుడు: కొంగరి కృష్ణ 
గాయని: ప్రభ 
సంగీతం: మహేష్ చింతల్ బోరి 

పల్లవి : 

అబ్బబ్బ పోరడు ఏమున్నడే 
గా రింగూలజుట్టోడు బాగున్నడే
అబ్బబ్బ పోరడు ఏమున్నడే 
గా రింగూలజుట్టోడు బాగున్నడే
రమ్మంటడే వాడు పొమ్మంటడూ 
గుట్టాకు రమ్మాని గుంజూతడు
అబ్బ రాను.. అబ్బ రాను
రాను రాను రాను 
నీ యెంట నేను రాను
రాను రాను రాను 
ఓ పిలగా ఓ అరుణు

అబ్బ రాను రాను అంటది 
అది మందిల నన్నే చూస్తది
అరె చెయ్యి సైగ నాకు చేస్తది 
ఆ ఎత్తూ సెప్పులా చిన్నది
గుణగుణ అరె గుణగుణ
గుణగుణ పోయేటి వయ్యారిభామ
మనసుదోచకే బంగారుబొమ్మ

గుణగుణ పోయేటి వయ్యారిభామ
మనసుదోచకే బంగారుబొమ్మ
రాయే రాయే పిల్ల 
నా మనసు దోచె రసగుల్ల

రింగూ రింగూల జుట్టూదానా

ప్రయివేటు సాంగ్ 
రచన: సురేష్ గంగుల, దేవ్ పవార్ 
గానం: రాము రాథోడ్, ప్రభ 
సంగీతం: కళ్యాణ్ కీస్ 

రింగూ రింగూల జుట్టూదానా
రంగూ రంగూల బొట్టూదానా
రింగూ రింగూల జుట్టూదానా
రంగూ రంగూల బొట్టూదానా

నాతో వస్తావా నాతో వస్తావా 
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

చెంగూ చెంగూన దుంకేటోడా
చెమ్కీ చెమ్కీలా చూపులోడా
చెంగూ చెంగూన దుంకేటోడా
చెమ్కీ చెమ్కీలా చూపులోడా

నీతో వస్తాలే నీతో వస్తాలే
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు