చిత్రం: శాంత (1961)
గానం: స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు
సంగీతం: రమేష్ నాయుడు
రచన: కొసరాజు
పల్లవి :
అట్టు అట్టు పెసరట్టు
అ ఉల్లిపాయ పెసరట్టు
ఉప్మాతో జతపెట్టు
భల్ చెట్నీతోటి కలేసికొట్టు
అట్టు అట్టు పెసరట్టు
అహ ఉల్లిపాయ పెసరట్టు
చరణం 1:
అబ్బబ్బబ్బా
దొరగార్ తయారుచేశారు
ఈ దొరసానులు రుచిచూచారు
దొరగార్ తయారుచేశారు
ఈ దొరసానులు రుచిచూచారు
సర్టిపికేట్ పడవేశారు
ఇటు పర్మనెంటు నను చేశారు
చరణం 2:
అబ్బో..!
భలే జోరుగా ఉందే వ్యవహారం!
నిన్ను జూచి నీ అందం జూచి
చురచురమను నీ చూపులు జూచి
ఆహా...! అలాగా...!
అవును
నిన్ను జూచి నీ అందం జూచి
చురచురమను నీ చూపులు జూచి
జోరంతా తగ్గించాను
జోహారని తలవంచాను
చరణం 3:
ఆహా...! ఏం తెలివి...!
కూరగాయల తెలివి
బస్తీమే సవాల్
చీపురుబట్టిన సిద్ధహస్తుడను
గరిటెపట్టినా కళాకారుడను
అబ్బో
చాలా దూరమొచ్చిందే
చీపురుబట్టిన సిద్ధహస్తుడను
గరిటెపట్టినా కళాకారుడను
కూరగాయల పనిపడతాను
కూర్చోపెట్టి తినపెడతాను
చరణం 4:
అబ్బబ్బబ్బబ్బబ్బా
వంటయింటిలో బడాయి
అహా ఎందుకు నీతో లడాయి
మాటలు కోటలు దాటు
నువ్ నేర్పినదీ అలవాటు
గాజుల చేతులు కలిసినప్పుడే
కమ్మగ కుదురును సాపాటు