ప్రయివేటు సాంగ్
రచన: సురేష్ గంగుల, దేవ్ పవార్
గానం: రాము రాథోడ్, ప్రభ
సంగీతం: కళ్యాణ్ కీస్
రింగూ రింగూల జుట్టూదానా
రంగూ రంగూల బొట్టూదానా
రింగూ రింగూల జుట్టూదానా
రంగూ రంగూల బొట్టూదానా
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
చెంగూ చెంగూన దుంకేటోడా
చెమ్కీ చెమ్కీలా చూపులోడా
చెంగూ చెంగూన దుంకేటోడా
చెమ్కీ చెమ్కీలా చూపులోడా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు
నువ్వు పాలకంకివే నా పూల ఎంకివే
నువ్వు చాలా పెంకివే రా రా రా
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
సన్నా సన్నాని నవ్వులదానా
నున్నా నున్నాని నడుముదానా
సన్నా సన్నాని నవ్వులదానా
నున్నా నున్నాని నడుముదానా
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా మేడారం జాతరకు
నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు
నాతో వస్తావా మేడారం జాతరకు
నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు
అరె కురసా కురసా కూసాలోడా
మెరిసే మెరిసే మీసాలోడా
కురసా కురసా కూసాలోడా
మెరిసే మెరిసే మీసాలోడా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీతో వస్తాలే మేడారం జాతరకు
నే పొద్దంతా ఉంటాలే ఏడవకు
నీతో వస్తాలే మేడారం జాతరకు
నే పొద్దంతా ఉంటాలే ఏడవకు
హే సన్నంచు చీర కట్టి
పూలంచు రైక చుట్టి
నా చిన్నియేలు బట్టి రా రా రా
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నల్లా నల్లాని కురులదానా
తెల్లా తెల్లాని బుగ్గలదానా
నల్లా నల్లాని కురులదానా
తెల్లా తెల్లాని బుగ్గలదానా
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా ఏడేడు బావులకు
అరె నేనస్సలే చెప్పను నీ బావలకు
నాతో వస్తావా ఏడేడు బావులకు
పిల్ల నేనస్సలే చెప్పను నీ బావలకు
ఆహా ఏడేడు బావులకెందుకంటా
నాకున్నా బావవి నువ్వేనంటా
ఏడేడు బావులకెందుకంటా
నాకున్నా బావవి నువ్వేనంటా
నీతో వస్తాలే
అరె నీతో వస్తాలే
పద పద
నీతో వస్తాలే నీ ఇంటి కోడలిగా
ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా
నీతో వస్తాలే నీ ఇంటి కోడలిగా
ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా
పూలబుట్ట పట్టుకొని
పాలగ్లాసు అట్టుకొని
సిగ్గులు తెగొట్టుకొని రా రా రా
నేనే వస్తాలే నేనే వస్తాలే
నేనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా
నీతో ఉంటాలే నీ ముద్దుల పెనిమిటిగా
నేనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా
నీతో ఉంటాలే నీ ముద్దుల పెనిమిటిగా