దారిపొంటత్తుండు
తెలంగాణా జానపదం
సంగీతం: ఎస్ కే మదీన్
సాహిత్యం: మామిడి మౌనిక
గాయని: మామిడి మౌనిక
పల్లవి:
ఆహా
దారిపొంటత్తుండు
దవ్వ దవ్వొత్తుండు
దారిద్దునా వోనిద్దునా
జోరు మీదొత్తుండు
కారు మీదొత్తుండు
తోలేద్దునా పోనీ ఊకుందునా
దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు వోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుతుండు
నా ముందుటుంటుండు
సందిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంట పోతాండు
అనుకుంట వత్తాండు
బందైదునా
బంధమై చూపనా