March 29, 2025

రామదాసు దేవదాసు హరికథ

రామదాసు దేవదాసుల హరికథ 
(నూతన్ ప్రసాద్)
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: కోపెల్ల శివరాం, ఎమ్వీయల్  
నేపథ్యగానం: బాలు

సీ మద్రమారమణ గోవిందో హా...రి 
భక్తులారా కామందులారాయ్ 
మరీ ఏటీ 
మన్నుతిన్న పాముల్లా 
మందుకొట్టిన సాముల్లా ఉన్నారు 
మత్తూ నిద్రమత్తూ వదిలేసి 
మళ్ళీ ఒకసారి 
ఏదీ 
నాయనా ఆర్మనీ 
సుతిచేసుకో నాయనా 
సుతుంటే మనిషి మనిషవుతాడు 
మంచోడే అవుతాడు 
సుతితప్పిన మడిసి పశువవుతాడు 
మతిలేనోడవుతాడు 
అదేనయ్యా నేను చెప్పే హరికథ   
సీ మద్రమారమణ గోవిందో హారి

సీరామ నామమ్ము 
సరవస్వమని నమ్మి 
ఊరోళ్ల సొమ్మంతా 
గుడికోసం జమచేసి 
గోవిందా... గోవిందా...
అప్పూల పాలాయెరా 
ఈ రామదాసు 
అప్పులదాసాయే 
చిప్పా చేతికి వచ్చే 
రామయ్య దయలేదురా  
రామా..! 
బతుకే మాయనుకుని 
భక్తి మందు తాగి 
ఒళ్ళు తెలియక 
రామదాసు కాసులేనోడయితే.. 

ఆడి బెదరు... దేవదాసు 
పారవతి దక్కక 
మనసు ఇరిగి 
మందు మరిగి 
ఇంటి ధ్యాసలేనోడయ్యాడు 
ఎలా అయ్యాడయ్యా 

కల్లు సారాయిలె మనసారా తలపోసి 
తన సొమ్ము కరగేసి 
తాగుడికే తగలేసి 
పీపాలు తెగతాగెను ఈ దేవదాసు  
టావ్ టడ డావ్ 
డొడ డ్యావ్ డ్యావ్ డ్యావ్ డ్యావ్

జగమే మాయని ఊగెను 
పారు పారూ పారు పారూ
జగమే మాయ బతుకే మాయ 
వేదాలలో సారా ఇంతేనయా 
సారా ఇంతేనయా

నాయనా ఆర్మనీ 
వాయించడం మటుకే నీ పని 
దగ్గు నాది... నా సొంతం 
అది నువ్ సెయ్యమాక 
ఆహహహహ (దగ్గు)
ఆ ప్రహారముగా 
డ్రాములు డ్రమ్ములుగా పెరిగి 
సొమ్ము సారాగా మారగా   

హిక్కడ రామదాసు వసూలైన సొమ్ము 
జమకట్టలేదని 
పైగా గుడికట్టాడని
పసిగట్టిన తానీషా 
ఆయన్ని కటకటాలెనక పెట్టగా 
ఎలా ఏడ్చాడయ్యా 

పేమాతో చేయిస్తి చింతాకు పతకము
సోకంతా నీదాయెనే సీతమ్మతల్లి 
దాసుడికి జైలాయెనే

ఏ తీరుగ నను దయజూసెదవో 
ఏ తీరుగ నను దయజూసెదవో
ఇనకులతిలకా రామా 
అని బోరుబోరుమన్నాడు 

బీరు బీరు 
మందెక్కువైంది 
మందేవదాసు దగ్గర 
సొమ్ము తక్కువైంది 
అప్పుడాయొక్క షాపువాడు  
పైబట్ట లొలిచేసి 
మెడపట్టి గెంటేస్తే 
పైబట్ట లొలిచేసి 
మెడపట్టి గెంటేస్తే
ఏ దారి లేదాయనో
బతుకు గోదారి పాలాయెనో   
దారే గోదారైతే పొరబాటు లేదోయ్ 
ఓడిపోలేదోయ్ 

పంచూడి పోయిందోయ్ 
ఏవిటోయ్ అంత సులభంగా ఊడిపోద్దేటీ 
ఊడిపోలేదోయ్
దోయ్ దోయ్ దోయ్ దోయ్ 
కూకో 

రామదాసుకు తిక్కరేగి 
నమ్ముకున్న రావుణ్ణి 
దుమ్మురేగేలా తిట్టడం మొదలెట్టాడు 
ఎట్టాగయ్యా అనంటే 
నగలనేసుకు కులుకుతాడు 
సీతనొదిలి కదిలిరాడు 
రావణాసుర భీతిరా 
అది రామసెంద్రుని నీతిరా 
ఎవడబ్బ సొమ్మని రామా..! 
ఏయ్ రామయ్యో....!
ఎవడబ్బ సొమ్మని
కులుకుతు తిరిగేవు రామసెంద్రయ్యో 

దేవదాసుకు ఒంటో సారా అంతా ఆవిరై 
చివరాకరికి ఎలాగయ్యాడయ్యా అంటే 
మందులేక నిలవలేను
మందుగొడితే కదలలేను  
మందులేక నిలవలేను
మందుగొడితే కదలలేను
వల్లకాడూ 
వల్లకాడూ కుక్కతోడూ 
చీమూ నెత్తురు లెండెరా
ఈ బొందీ మందుతొ నిండెరా 

రామదాసు రమ్ముదాసులిద్దరూ 
భక్తి తాగి ఒకడు 
మందు తాగి ఒకడు
ఊగారు 
వాగారు 
తిట్టసాగారు 
ఎట్టాగయ్యా అంటే
జతి.. అదీ వరస 

ఉన్నావా 
అసలున్నావా 
ఉంటే కళ్ళు మూసుకున్నావా?
ఎరక్కపోయి మొక్కాను ఇరుక్కుపోయాను 

ఉన్నానా 
బతికున్నానా 
ఉన్నా కన్ను మూసుకున్నానా?
ఎరక్కపోయి తాగాను ఇరుక్కుపోయాను

రామదాసు దేవదాసులనే  
ఇద్దరు దాసుల కథ చెప్పిన 
ఈ హరిదాసు చెప్పిందేంటయ్యా 
చివరాకరికంటే 

భక్తయినా బ్రాందీ అయినా 
లిమిటేషన్ లో ఉంటే ఏటీ  
లిమిటేషన్ లో ఉంటే లిటిగేషనుండదు
కాబట్టి (హార్మనీ అపశృతి)
ఒరే ఆర్మనీ 
అయిపోవచ్చింది నాయనా  
సుతి చూసుకో 
సుతి చేసుకో
కావలిస్తే ఇంకోసారి 

సుతి ఉంటే మడిసే మడిసౌతాడు
మంచోడే ఔతాడు
సుతి తప్పిన మనిషి కరుసౌతాడు
మతిలేనోడౌతాడు (ముక్తాయింపు)
సీ మద్రమారమణ గోవిందో హా.. రి