ఆనిమల్ (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
గానం: సోనూ నిగమ్
ఆర్. పి. కృష్ణాంగ్ (చైల్డ్ వెర్షన్)
రచన: అనంత శ్రీరామ్
పల్లవి:
నా సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివీ నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా
నువ్వే కదా
సితార నా కలకీ
నాన్నా నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నిలా అనేదేలా
ఇవ్వాళ నీ ఎదుటా
చరణం 1:
నీ చేతులలో ఊయలలూగే
ఆ సంబరమింకెపుడో
నీ భుజములపై తలవాల్చుకునే
ఆ పండగ నాకెపుడో
క్షణానికో సవాలిలా
జవాబు లేదిపుడూ
నాన్నా నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నిలా అనేదేలా
ఇవ్వాళ నీ ఎదుటా
చరణం 2:
ఏ కానుకలూ నీ లాలనతో
సరితూగవు ఇది నిజమే
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే
నాన్నా నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నిలా అనేదేలా
ఇవ్వాళ నీ ఎదుటా
చరణం 3:
ఈ జన్మవనీ ఏ జన్మవనీ
తీరాలి ఋణం మనకీ
పై జన్మకీ నువ్వు నాన్నవలె
వస్తావట నా దరికీ
ఇదే వరం ఇదే శుభం
మనిద్దరి ఈ కథకీ...