నా హృదయమా

చిత్రం: ప్రియ (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్యగానం: బాలు, జానకి   

పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. 
నా హృదయమా .. 
నా హృదయ ఉదయరాగమా
మాయనీ... తీయనీ... 
మధురగీతి పాడుమా

చరణం 1 :

అందమై... మకరందమై
మందబంధ మలయానిల గంధమై
మదనుని విరివిల్లున అరవిందమై
ఎలతేటి ఎద మీటు ఆనందమై.. 
ఎలతేటి ఎద మీటు ఆనందమై..
పులకరించు కుసుమమా.. 
పులకరించు కుసుమమా

నా హృదయమా .. 

చరణం 2 :

ఆటవై.. సయ్యాటవై..
చిలిపి వలపులాడే చెరలాటవై...
తలపుల తత్తరలో తచ్చాటవై..
పరువాల సరదాల బూచాటవై..
పరువాల సరదాల బూచాటవై..
కరిగిపోవు స్వప్నమా.. 
కరిగిపోవు స్వప్నమా..

నా హృదయమా... 

చరణం 3 :

వాణివై…  వరవీణవై
బృందావన సమ్మోహన వేణువై
పదకవితా మృదుభాషల బాణివై
అనురాగరాగాల నెరజాణవై... 
అనురాగరాగాల నెరజాణవై..
గానమైన మౌనమా.. 
గానమైన మౌనమా..  

గాలివై.. చిరుగాలివై
సిరిమల్లెల చిరుజల్లుల వేళవై
కనుసన్నల తెలివెన్నెల జాలువై
జోజోల ఉయ్యాలజంపాలవై... 
జోజోల ఉయ్యాలజంపాలవై...
సేదదీర్చు నేస్తమా.. 
సేదదీర్చు నేస్తమా..

నా హృదయమా…  

No comments:

Post a Comment

Leave your comments