రావె మోహిని

గోపాలరావు గారి అబ్బాయి (1989)
సంగీతం: ఇళయరాజా 
రచన: సీతారామశాస్త్రి 
గానం: బాలు, జానకి

పల్లవి : 

రావె మోహిని 
రసరాగవాహిని
రావె మోహిని 
రసరాగవాహిని
మనలో మరులే సుధలై 
నిలువనీవే..
రావె మోహిని
రసరాగవాహిని

చరణం 1:

శ్వాసలోని ఆశ నీవే 
చలువ జాబిలీ

తేనెసోనలోన నేను తేలిఆడనా చెలి

నిను కోరి విరిసేను 
నీది ఈ కలువా

నిను చేరి మురిసేను 
నీవు నా కళవే

ప్రాణమైనా ధ్యానమైనా
ప్రాణమైనా ధ్యానమైనా
నీవే...

నీవే నా మది..
అనురాగ కౌముది
నిశిలో శశివై 
నడిపే వెలుగు నీవే..

నీవే నా మది..
అనురాగ కౌముది

చరణం 2:

వీడిపోని నీడనై 
నీ తోడు నడవనా

వాడిపోనీ వలపు పూల 
మాల నీకు వేయనా

కనరాని సురసీమ 
భూమి పై వెలిసే

ఎనలేని సుఖమేదో 
నీ జతే తెలిపే

కోరుకున్న నారి కన్నా
కోరుకున్న వారి కన్నా
సిరి ఏ...దీ...

రావె మోహిని

No comments:

Post a Comment

Leave your comments