దారిపొంటత్తుండు
తెలంగాణా జానపదం
సంగీతం: ఎస్ కే మదీన్
సాహిత్యం: మామిడి మౌనిక
గాయని: మామిడి మౌనిక
పల్లవి:
ఆహా
దారిపొంటత్తుండు
దవ్వ దవ్వొత్తుండు
దారిద్దునా వోనిద్దునా
జోరు మీదొత్తుండు
కారు మీదొత్తుండు
తోలేద్దునా పోనీ ఊకుందునా
దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు వోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుతుండు
నా ముందుటుంటుండు
సందిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంట పోతాండు
అనుకుంట వత్తాండు
బందైదునా
బంధమై చూపనా
చరణం 1:
ఆహా
గాలిగలి జేత్తుండు
గండమై కూసుండు
గాలిద్దునా.. అహహా
అహ ఆహా గాలిగలి జేత్తుండు
గండమై కూసుండు
గాలిద్దునా వీణ్ణి గోలిద్దునా
రాయే పోయే అంటుండు
రౌసు పెట్టుకుంటుండు
రమ్మందునా వీణ్ణి పొమ్మందునా
గాలిగలి జేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సందిద్దునా
గాలిగలి గాలిగలి గాలిగలి గాలిగలి
గాలిగలి చేత్తుండు
గడుసుదాన్నంటుండు
తలతింటడే తరమైతలే
సోయి లేకంటుండు
సోపతైతంటుండు
సోయిన్నదో వీన్కి సోకున్నదో
అర్థమైతుందా...! నిన్నే
అరె...
ఇటు చూడంటే
వింటున్నావా...?
చరణం 2:
ఆహా
తిప్పిచ్చుకుంటుండు
తప్పిచ్చుకుంటుండు
ఒప్పిద్దునా వీణ్ణి తప్పిద్దునా
ఈడైతనంటుండు జోడైతనంటుండు
ఇరిసేద్దునా వీణ్ణి మరిసుందునా
తిప్పిచ్చుకుంటుండు తింగరోడే
తప్పిచ్చుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఏగైతడో వీడేమైతడో
చరణం 3:
ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసైంది వరసైతె కలిసింది
ఇడిసుండకోయ్ పిలగ మరిసుండకోయ్
నాగుంబాము కోపమోడే
జెర్రుపోతు పిరికోడే
అగ్గగ్గొ అగ్గగ్గొ అగ్గగ్గొ అగ్గగ్గొ
అగ్గగ్గొ కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటజూడే మమ్ము జంటజెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
ఆణ్ణి కలిసే తొవ్వ చూపరాదే
పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న
మరవొబోకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడినే కడుతాను
ఎంబటుండేటోన్ని పిలవరాదే