మనుషులు మారాలి (1969)
రచన: శ్రీశ్రీ
సంగీతం: మహదేవన్
గానం: పిఠాపురం, మాధవపెద్ది బృందం
పల్లవి :
యూనియన్ జిందాబాద్
ఇంక్విలాబ్ జిందాబాద్
యూనియన్ జిందాబాద్
ఇంక్విలాబ్ జిందాబాద్
అరుణపతాకం ఎగిరింది
కార్మికలోకం గెలిచింది
మానవులంతా ఒకటని చాటే
మరోప్రపంచం పిలిచింది
॥అరుణ॥
చరణం 1:
వస్తున్నాం మేం వస్తున్నాం
కలసికట్టుగా వస్తున్నాం
వస్తున్నాం మేం వస్తున్నాం
కలసికట్టుగా వస్తున్నాం
విప్లవజ్యోతులు వెలిగించి
విప్లవజ్యోతులు వెలిగించి
దోపిడిమూకల తుడిచేస్తాం
దోపిడిమూకల తుడిచేస్తాం
యూనియన్ జిందాబాద్
ఇంక్విలాబ్ జిందాబాద్
॥అరుణ॥
చరణం 2:
ఫ్యాక్టరీలు మా పుట్టిళ్ళు
అవే మాకు దేవుడిగుళ్ళు
ఫ్యాక్టరీలు మా పుట్టిళ్ళు
అవే మాకు దేవుడిగుళ్ళు
పగలూ రేయీ పని చేస్తాం
పగలూ రేయీ పని చేస్తాం
ప్రజలకు సంపద పంచేస్తాం
ప్రజలకు సంపద పంచేస్తాం
కార్ఖానాలను మూసేస్తే
తలుపులు మళ్ళీ తెరిపిస్తాం|
కార్ఖానాలను మూసేస్తే
తలుపులు మళ్ళీ తెరిపిస్తాం|
యూనియన్ జిందాబాద్
ఇంక్విలాబ్ జిందాబాద్
॥అరుణ॥
No comments:
Post a Comment
Leave your comments