July 23, 2025

నేను గాలిగోపురం

మనసున్న మారాజు (2000)
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయణ్, అనూరాధ పౌడ్వాల్
టిప్పు (హమ్మింగ్)

పల్లవి:
  
నేను గాలిగోపురం 
నీవు ప్రేమపావురం
వచ్చీ వాలే ఈ క్షణం
 
నేను తెల్లకాగితం 
నీవు తేనె సంతకం
కోరుకున్న ఈ దినం 

ప్రేమకు దేవత నీవని తెలిసి
నా మది నీకొక కోవెల చేసా
ఓ ప్రియా.....
ఓ ప్రియా... ఓ ప్రియా..ఆ
నేను గాలిగోపురం 

చరణం 1:

మాఘమాస వేళా  
ఈ మంచుతెరలలోనా

మధువనాల బాలా 
నీ పెదవులందుకోనా

పులకరింత పూజా 
ఈ పూట చేసుకోనా

కలవరింతలన్నీ 
నే కౌగిలించుకోనా

మాయో ఏమి మాయో 
ఎంత హాయో ఈ బంధం

నీడో తోడునీడో 
నాకు నీవే జన్మాంతం

ఓ ప్రియా నా ప్రియా 
యాయా నీ దాన్నైపోయా

నేను గాలిగోపురం 

చరణం 2: 

ఈ వసంతవేళా 
నీ వయసు పూలుపూసే

పూలగాలి నీలోనా
వలపు వేణువూదే

ప్రేమ మందిరానా 
కుడికన్ను అదిరినేలా

పెళ్ళిమండపానా
కుడికాలు పెట్టి రానా

నీవే నాకు నీవే 
సాగి రావే నా కోసం

దేవా ప్రేమదేవా 
నీకు సేవే నా ప్రాణం

ఓ ప్రియా నా ప్రియా 
యాయా నీ వాణ్ణైపోయా
నేను గాలిగోపురం