ఆశ జ్యోతిగా వెలిగింది
చిత్రం : ఆశాజ్యోతి (1981)
గీత రచన : సినారె
సంగీతం : రమేష్ నాయుడు
గానం : వాణీ జయరాం
పల్లవి:
ఆశ జ్యోతిగా వెలిగింది
నిరాశ నీడగా కదిలింది...
నిజము నిప్పుగా రగిలిందంటే
నా ఆశాజ్యోతి ఏమౌతుంది
ఈ ఆశకు జ్యోతి ఏమౌతుంది
ఆశ జ్యోతిగా వెలిగింది
నిరాశ నీడగా కదిలింది...
చరణం 1:
పంచవన్నెల చిలక ఎగిరిపోయింది
పసిడిపంజరం మిగిలిపోయింది
పంచవన్నెల చిలక ఎగిరిపోయింది
పసిడిపంజరం మిగిలిపోయింది
రెక్కలొచ్చి ఆశ చుక్కల్లో చేరినా
తెలవారని రేయిలో కలగంటూ హాయిగా
జ్యోతి పాడుకుంటుంది ఈ పాట
ఇదేలే వెలుగునీడల పాట
ఆశ జ్యోతిగా వెలిగింది
నిరాశ నీడగా కదిలింది...
చరణం 2:
ఏడురంగుల బొమ్మ కరిగిపోయింది
స్వాతిచినుకులే కురిసిపోయింది
ఏడురంగుల బొమ్మ కరిగిపోయింది
స్వాతిచినుకులే కురిసిపోయింది
కన్నుల్లో కాటుకా జాబిల్లికంటినా
వెన్నెలింటి చల్లనా కన్నెకలువ కందునా
ఆశగా పాడుకున్నదీపాట
ఇదేలే ఆశాజ్యోతుల పాట
ఆశ జ్యోతిగా వెలిగింది
నిరాశ నీడగా కదిలింది...