June 21, 2020

కనుబొమ్మల పల్లకిలోనా

కనుబొమ్మల పల్లకిలోనా 
చిత్రం :  నెలవంక (1983) 
సంగీతం :  రమేశ్ నాయుడు 
గీతరచయిత :  ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
నేపధ్య గానం :  బాలు,  జానకి 

సాకీ : 

ఈ కోవెల వాకిలిలో .. 
ఏదో అడుగు సవ్వడి .. 
ఏ దేవుడు దయతో నా ఎదలో .. 
అడుగిడు .. వడి వడి  
పల్లవి : 

అహా.. ఆ.. ఆ.. ఆ..  
కనుబొమ్మల పల్లకిలోనా .. 
కన్నెసిగ్గు వధువయ్యిందీ .. 
ఆ.. ఆ.. విరి మొగ్గల మధువయ్యిందీ.. 
ఆ.. ఆ.. హరివిల్లై పెదవి వదలినా .. 
చిరునవ్వే వరమయ్యిందీ .. 
సిరిమువ్వల వరదయ్యిందీ.. 

నీ కన్నుల వెన్నెల చూసీ .. 
మనసే చిరుతరగయ్యిందీ .. 
కృష్ణవేణి పరుగయ్యిందీ... ఆ.. ఆ.. 
దయ నిండిన గుండెను చూసీ .. 
తనువే ఒక పులకయ్యిందీ .. 
నును సిగ్గుల మొలకయ్యిందీ...  

చరణం 1 : 

కనురెప్పల గొడుగును వేసీ .. 
తోడునీడనౌతాను 
అడుగులకే మడుగులుగా .. 
నా అరచేతులు పడతాను 
నీ జడలో మొగలిరేకునై .. 
బతుకు పంచుకుంటాను 
నీ జడలో మొగలిరేకునై .. 
బతుకు పంచుకుంటానూ 

కనుబొమ్మల పల్లకిలోనా .. 
కన్నెసిగ్గు వధువయ్యిందీ .. 
విరి మొగ్గల మధువయ్యిందీ.. 
ఆ.. ఆ.. 

హరివిల్లై పెదవి వదలినా .. 
చిరునవ్వే వరమయ్యిందీ .. 
సిరిమువ్వల వరదయ్యిందీ..  

చరణం 2 : 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఉ.. ఉ.. ఉ..  
అంతరంగమిదుగో స్వామీ .. 
నేడు మీకు నెలవంటానూ 
మూగబడిన నా గుండెలలో .. 
రాగలహరివనుకుంటానూ 
అవధిలేని అంబరమే .. 
నా ఆనందపు పరిధంటానూ 
అవధిలేని అంబరమే .. 
నా ఆనందపు పరిధంటాను.. 
నీ కన్నుల వెన్నెల చూసీ .. 
మనసే చిరుతరగయ్యిందీ .. 
కృష్ణవేణి పరుగయ్యిందీ.. 
ఆ.. ఆ.. ఆ.. ఆ 
 దయ నిండిన గుండెను చూసీ .. 
తనువే ఒక పులకయ్యిందీ .. 
నును సిగ్గుల మొలకయ్యిందీ... 
ఉ.. ఉ.. ఉ..