ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ
చిత్రం: దేవుడే గెలిచాడు (1976)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: జాలాది రాజారావు
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
చెరిసగాల భావనతో..
యుగయుగాల దీవెనతో
రేపు మాపు లాగా కలసిఉందాము..
కరిగిపోదాము.. కరిగిపోదాము..
నాలో.. నీలో.. నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను..
పాడి ఆడతానూ.. ఆ.. ఆ.. ఆ..
ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
చరణం 1:
నిన్నటిలో నిజంలాగనే రేపు తీపిగావుంటే...
ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే
చావని కోరికలాగే...పుడుతుంటాను..
తిరిగిపుట్టి చావకుండా బ్రతికుంటాను
ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
చరణం 2:
నా జన్మకు ప్రాణం నీవై..
నీ ప్రాణికి ఆత్మను నేనై
కాలానికి ఇరుసువు నీవై..
తిరుగాడే వలయం నేనై
ఎన్ని తరాలైనా..
మరెన్ని యుగాలైనా
వీడని బంధాలై..
కావ్యపు గంధాలై
నాలో.. నీలో..
నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను..
పాడి ఆడతానూ.. ఆ.. ఆ.. ఆ..
ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ