ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా
చిత్రం : వజ్రాయుధం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఆ....
ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా
ఆ చల్లకొచ్చి ముంతదాచుడేందబ్బా
చూడగానే తాపమాయే
ఎండలోన దీపమాయే
రెప్పకొట్టి గిల్లమాక
రెచ్చగొట్టి వెళ్ళామాక
రేపుదాక ఆగలేనులే
(గూటికొచ్చి ఉండమాక
గుండె గోడు పెంచమాక
జాగు ఇంక ఓపలేనులే )
నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా
ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా
గుమ్మ ఈడు తాపమాయే
గుండెలోన తాళమాయే
దగ్గరుంటె దప్పికాయే
పక్కనుంటె ఆకలాయే
ఎక్కడింక దాగిపోనురా...