Showing posts with label కలుసుకోవాలని (2002). Show all posts
Showing posts with label కలుసుకోవాలని (2002). Show all posts

ఉదయించిన సూర్యుడినడిగా

ఉదయించిన సూర్యుడినడిగా
కలుసుకోవాలని (2002)
సిరివెన్నెల
దేవిశ్రీప్రసాద్

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలొ నీ గుడి నడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అనీ
చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చనీ నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే

చరణం 1

మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడెక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కళల నుండి ఓ నిజమై రావె నన్ను చేరావె
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తాళం నువ్వే
యెదను మీటు సుస్వరమై రావె నన్ను చేరవె

చరణం 2

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటొంది
నువ్వు లేక వెన్నెల కూడ ఎండల్లె మండుతొంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే ఘడియ మన దరికి చేరుకొంది
ఏమి మాయవొ ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడునావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేకనే లేనేలేనని కాస్త తెలుపని

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె

ఆకాశం తన రెక్కలతొ
కలుసుకోవాలని (2002)
దేవిశ్రీప్రసాద్
సుమంగళి, సత్య

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంతా  తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి

చరణం 1

అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలొ అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంధ్ర ధనసుని ఊయలగ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావాలి
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కళ్ళాపే చల్లాలి ఆ రంగుల నుండి లాలించే
ఒక రాగం పుట్టాలి

చరణం 2

నా వాడు ఎక్కడున్నా సరే  రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడుంటు యెన్నడైన సరె పసిపాపల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
ఏనాడూ  నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి