Showing posts with label సుమంగళి. Show all posts
Showing posts with label సుమంగళి. Show all posts

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె

ఆకాశం తన రెక్కలతొ
కలుసుకోవాలని (2002)
దేవిశ్రీప్రసాద్
సుమంగళి, సత్య

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంతా  తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి

చరణం 1

అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలొ అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంధ్ర ధనసుని ఊయలగ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావాలి
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కళ్ళాపే చల్లాలి ఆ రంగుల నుండి లాలించే
ఒక రాగం పుట్టాలి

చరణం 2

నా వాడు ఎక్కడున్నా సరే  రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడుంటు యెన్నడైన సరె పసిపాపల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన్న తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
ఏనాడూ  నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి