మామా! శతృభయంకర నామా!
చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం,
రమణారెడ్డి, పద్మనాభం, రేలంగి, సూర్యకాంతం
మామా! శతృభయంకర నామా!
అందానికి చందమామా-
మా మామ...
ఈ సదానందానికి సాక్షాత్తు మేనమామ
బలమున గామా....
(గామా; ప్రపంచ ప్రసిద్ధి చెందిన వస్తాదు.)
నీవే కద మా ధీమా....
గుణధామా!
విశ్వదాభిరామా!
సదానందం! శభాష్...
మామకు తగ్గ అల్లుడవనిపించావోయ్
బ్రదర్! కందం అందంగా చదివావ్
కానీ...యతి లేదు.
నీకు మతిలేదు బ్రదర్...
ఆషామాషీ కాదు...
పెద్ద కవిచేత వ్రాయించాను...వ్రాసాను
లేడీస్ అండ్ జెంటిల్మెన్...
ఎదో చిన్నవాణ్ణి....
ఈ శుభసమయంలో మా మామగారికి
నాదీ ఒక చిన్న కానుక
బ్రదర్! మీరు కూర్చోండి....
ఆ...ఏమీలేదు...మామగారి మీసంపై సీసం
అయ్యో... అయ్యో... అదేమిటబ్బాయ్...!
బంగారంలాంటి నాన్నగారి మీసం మీద
సీసం పోస్తానంటావ్...నీ మిలట్రీ బుద్ధులు
పోనిచ్చావ్ గావు....
అహహ్హ...వదినగారూ
సీసమంటే ఆ సీసం గాదు సీసపద్యం
ఆశువుగా చదువుతాను... ఆలకించండి.
కారుమబ్బులు బారు
సౌరు నేలెడి తీరు
కోరమీసము పొందు కోరుకొందు
మృగరాజు జూలునే
తెగనాడ జాలు...మామ
నీ ఘనమీసము పసందు
కనులవిందు
గండుచీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు...
ఠా!
మెలిబెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగనమండలముపై కాలుదువ్వూ...
ఎవరు మోయుచున్నారు ఈ అవని బరువు..?
ఆదిశేషుడా? కూర్మమా? కాదుకాదు...
అష్టదిగ్గజ కూటమా...? అదియు కాదు...
అయితే మరి ఏదయ్యా ....?
మామ మీసాలే భువికి శ్రీరామరక్షా....ఆ