February 18, 2020

ఒక పిలుపులో పిలిచితే


ఒక పిలుపులో పిలిచితే
చిత్రం: శ్రీ వెంకటేశ్వర వైభవం (1971)
గాయని: శ్రీరంగం గోపాలరత్నం
రచన: ఏడిద కామేశ్వరరావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా . .
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా
నా పలుకులో కులుకుతావటా . . ఓ . .
ఆపదమ్రొక్కుల స్వామీ
నీ సన్నిధె నా పెన్నిధీ. .
నీ సన్నిధె నా పెన్నిధీ. .చరణం 1:

కొండంత దేవుడవని
కొండంత ఆశతో
నీ కొండ చేర వచ్చితినీ . .
అండ జేర్చి కాపాడరా
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా

అభయహస్తమున్నదట . .
అభయమూర్తి వీవె అటా . .
అభయదానమిచ్చి మాకు భవతరణకు
దొమ్ము చూపూ
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా

వడ్డికాసు వాడవటా . .
వడ్డి వడ్డి గుంజుదువటా . .
అసలు లేని వారమయ్య
వెతలు బాపి కావుమయ్యా
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా . .
నా పలుకులో కులుకుతావటా
ఓ ఆపదమ్రొక్కుల స్వామీ . .
నీ సన్నిధె నా పెన్నిధీ. .
నీ సన్నిధె నా పెన్నిధీ. .