చిత్రం: చాణక్య-చంద్రగుప్త (1977)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సినారె
సంగీతం: పెండ్యాల
గానం: వాణీ జయరామ్
పల్లవి :
సిరి సిరి సిన్నోడా
మగసిరి వున్నోడా
సిరి సిరి సిన్నోడా
మగసిరి వున్నోడా
చెకుముకిరవ్వను
చికిలింతపువ్వును
కడతార జోడీ
కొడతార డీడీ...
ఓయబ్బో
చరణం 1:
పుట్టతేనెలా పూతవయసు పొంగుతున్నదీ
అది ముట్టబోతే లేతసిగ్గు ముసురుకన్నది
పుట్టతేనెలా పూతవయసు పొంగుతున్నదీ
అది ముట్టబోతే లేతసిగ్గు ముసురుకన్నది
చేపట్టే ఒడుపే ఉంటే
జతకట్టే బులుపే ఉంటే
చేపట్టే ఒడుపే ఉంటే
జతకట్టే బులుపే ఉంటే
కడతార జోడీ
కొడతార డీడీ...
ఓయబ్బో
సిరి సిరి సిన్నోడా
చరణం 2:
కోడెపొగరులో నువ్వు నన్ను కవ్విస్తుంటే
సరికొత్త విసురులో నిన్ను నేను కమ్మేస్తుంటే...
ఆయ్ కోడెపొగరులో నువ్వు నన్ను కవ్విస్తుంటే
సరికొత్త విసురులో నిన్ను నేను కమ్మేస్తుంటే
ఆ ముచ్చట తీరాలంటే
గోరువెచ్చని కోరిక ఉంటే
ఆ ముచ్చట తీరాలంటే
గోరువెచ్చని కోరిక ఉంటే
ఆయ్ కడతార జోడీ
కొడతార డీడీ...
ఓయబ్బో
సిరి సిరి సిన్నోడా
No comments:
Post a Comment
Leave your comments