August 10, 2021

నీ కాటుక కన్నుల తళుకే



నీ కాటుక కన్నుల తళుకే
చిత్రం: నా పిలుపే ప్రభంజనం (1986)
సంగీతం: రాజ్-కోటి
గానం: రాజ్ సీతారామ్, సుశీల

పల్లవి:

నీ కాటుక కన్నుల తళుకే
నను రారమ్మనే
నీ బిగి కౌగిలిలో కులుకే
నను లే లెమ్మనే

గడసరి మగసిరి వాడివనే  
నిను కోరేనులే
నా సరి సొగసరి వాడివనే
నిను చేరేనులే...
చరణం 1:

మనసున మరులూరించిన
మనసున మరులూరించిన
నా ఊహలలో నిను చూచితిలే
నా ఊపిరిలో నిను దాచితిలే
నిజమిదీ.... ఓ ప్రియా

మనసున మరులూరించిన
మనసున మరులూరించిన
నీ పెదవుల మధువుల సోనలలో
నా హృదయము సోలెను స్వర్గములో..
నిజమిదీ.... ఓ ప్రియా

చరణం 2:

మనసున మరులూరించిన
మనసున మరులూరించిన
ఆ నింగిని రంగుల వెండివలె
నా సందిట వంగిన జంటవులే
నిజమిదీ... ఓ ప్రియా

మనసున మరులూరించిన
మనసున మరులూరించిన
నీ పదములు కదిలిన రవ్వంత
నా ఎదలో రగులును కవ్వింత
నిజమిదీ.... ఓ ప్రియా