ఉదయ కిరణాలలోన

చిత్రం: పాల మనసులు (1968)  
రచన: సినారె
సంగీతం: సత్యం
గానం: ఎస్.జానకి

పల్లవి:  

ఉదయ కిరణాలలోనా..  
ఉదయ కిరణాలలోనా... 
నా హృదయాన కదలాడె  
నవరాగ వీణ  
ఉదయ కిరణాలలోనా.. 
నా హృదయాన కదలాడె  
నవరాగ వీణ 
ఉదయ కిరణాలలోనా

చరణం 1:

ఆ ఆ ఆ 
పసరాకులపై కురిసే వెలుగులు .. 
ఆ ఆ ఆ
పసరాకులపై కురిసే వెలుగులు
కొస తీవెలపై విరిసే  వెలుగులు
ఆలయశిఖరాల అంచుల మెరిసి 
ఆలయశిఖరాల అంచుల మెరిసి 
నాలో పొంగారు బంగారు వెలుగులు 

ఉదయ కిరణాలలోనా 

చరణం 2:

జగమే కమలమై వికసించినది 
ఆ ఆ ఆ
జగమే కమలమై వికసించినది
మనసే భ్రమరమై రవళించినది 
ఆ భగవానుని ఆరని కళలు
ఆ భగవానుని ఆరని కళలు
అణువూ అణువున పులకించినవి 

ఉదయ కిరణాలలోనా 

No comments:

Post a Comment

Leave your comments