అత్తరుసాయిబో రారా

రాజును చూసిన కళ్ళకి మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధవుతుందని సామెతుంది కదండీ 
అలాగే ఆడవారి కోరికలు తీర్చే మగడు దొరకడం అదృష్టమే...
సంపాదన లేని భర్తంటే ఏ భార్యకైనా ఏవగింపే సరదాలు తీరవుగా మరి 
అలాంటి ఓ పడతి గోడు విందామా...?

అత్తరుసాయిబో రారా 
రాయలసీమ జానపదం 

పల్లవి: 

అత్తరుసాయిబో రారా 
అందగాడా రారా
అత్తరుసాయిబో రారా 
నా అందగాడా రారా

అరెరే 
అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరమేసిండు 
అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరమేసిండు 
ఉత్తరమేసిన నా మొగుడు ఊర్లో లేడమ్మో
అత్తరుసాయిబు రారా నా అందగాడ రారా

చరణం 1: 

అందరి మొగుళ్ళు బీదరుబోయి బిందెలు తెస్తుంటే 
అందరి మొగుళ్ళు బీదరుబోయి బిందెలు తెస్తుంటే 
నా మొగుడు బీదరుబోయి బిగసకపోయినాడో 
||అత్తరు||

చరణం 2: 

అత్తరుసాయిబు మంచోడమ్మా సూపుకు నచ్చిండు 
అత్తరుసాయిబు మంచోడమ్మా సూపుకు నచ్చిండు 
సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండో 
||అత్తరు||

చరణం 3: 

అందరి మొగుళ్ళు బొంబయికెళ్ళి బిసినెస్ చేస్తుంటే 
బిసినెస్ చేస్తుంటే ఓహో బిసినెస్ చేస్తుంటే
బొంబయికెళ్ళిన నా మొగుడు బేవర్సయినాడో 
||అత్తరు||

చరణం 4: 

అందరి మొగుళ్ళు చిలంకూరు బోయి చీరలు తెస్తుంటే 
అందరి మొగుళ్ళు చిలంకూరు బోయి చీరలు తెస్తుంటే
నా మొగుడు చిలంకూరు పోయి గోనెపట్ట తెచ్చినాడో 
||అత్తరు||

చరణం 5:

అత్తరుసాయిబు మంచోడమ్మా సూపుకు నచ్చిండు 
అత్తరుసాయిబు మంచోడమ్మా సూపుకు నచ్చిండు
సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండో 
||అత్తరు||

చరణం 6: 

అందరి మొగుళ్ళు రాతిరిపూట రాగాలు తీస్తుంటే 
అందరి మొగుళ్ళు రాతిరిపూట రాగాలు తీస్తుంటే 
నా మొగుడు రాతిరిపూట గురకలు తీస్తాడో 
||అత్తరు||

అత్తరుసాయిబు అత్తరుసాయిబు
అత్తరుసాయిబు మంచోడమ్మా ఉత్తరమేసిండు

No comments:

Post a Comment

Leave your comments