ఇది రాగమైనా
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, చిత్ర
పల్లవి:
ఇది రాగమైనా అనురాగమే
తొలి అనుభవ గీతమిదే
ఇది రాగమైనా అనురాగమే
కన్నులే ఎద జల్లగా...
కాటుకే హరివిల్లుగా
జత పడిన మనకు శృతి కలిసెనిపుడు
ప్రియతమా మధుర లయే కదా మనుగడ
ఇది రాగమైనా అనురాగమే
తొలి అనుభవ గీతమిదే
చరణం 1:
వేణువులూదెను వేసవి గాలి
మువ్వలు చిందే కిన్నెరసాని
మగసిరి మారాజు దొరికేననీ
సొగసిరి అందాలు దొరకేననీ
ఇటు పూలతోట..అటు తేనెపాట
ప్రియ స్వాగతాలు పాడేసన్నగా
అలివేణిలాగా చలి వీణతీగ
విరి మూగబాసలాడె ముద్దుగా
ఎద ఝుమ్మని...దరి రమ్మని
తొలి ఋతువు పలికె పసి పెదవి వణికే
మమ అనే మధుర వసంతమే మనుగడ
చరణం 2:
నవ బృందావని నవ్వుల మాసం
మమతల కోయిల మధుర సరాగం
మనసున నీ నీడ పొడిగించగా
మనిషిగ నీలోన తలదాచగా
ముసినవ్వు సిగ్గు ముత్యాలముగ్గు
రస రాజధాని స్వాగతాలుగా
అటు గోకులాన ఇటు గుండెలోన
నవ రాసలీల సాగె లీలగా
నను రమ్మనీ ...మనసిమ్మనీ
ఒక తలపు పిలచె ఒడి తలుపు తెరిచె
కలవరాలొలుకు కథే కదా సరిగమ...