August 7, 2023

ఒళ్ళే పూతరేకు

ఒళ్ళే పూతరేకు 
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి 
రచన: వేటూరి
గానం: చిత్ర, బాలు 

పల్లవి: 

ఒళ్ళే పూతరేకు 
వాటేసుకుంటే సోకు 

ఆమ్మో అంటుకోకు 
అబ్బ రాలుతుంది రేకు 

విచ్చే వేళలో 

ఇచ్చే ఠీవిలో 

మొగలిపూల మగ యవ్వనం 

పగలే కోరే సొగసే దినం 

తనువందించే తాంబూలంలో 
ఒళ్ళే పూతరేకు 
వాటేసుకుంటే సోకు 

ఆమ్మో అంటుకోకూ 


చరణం 1:

కోకిలమ్మ మావూరొచ్చి 
కొత్తపాట పాడేస్తుంటే 

కోకలమ్మ మాగాణుల్లో 
కొత్తనారు పోసేస్తుంటే 

కోకపాడు దాటంగానే 
పిక్కలూరు పేటేనమ్మో

సక్కనమ్మ చిక్కంగానే 
తిక్కలోడి పాటేనమ్మో 

పుచ్చుకున్న కౌగిళ్ళలో 
గుజ్జు తీయనా 

హత్తుకున్న ఒత్తిళ్ళల్లో 
సొత్తుదాగునా 

పెదవందించే పేరంటంలో 
 
చరణం 2:

గాలిముద్దైనా లేక 
వేణువెట్ట పాడేనమ్మా 

వేలి మీటుడైనా లేక 
వీణ ఎట్ట మోగేనమ్మా 

పాలకంకి అందాలన్నీ 
పిట్టలెత్తుకెళ్ళాలమ్మో 

కన్నె సిగ్గు పడ్డాదంటే 
కందిచేను పండాలమ్మో 

చేయి పడ్డ చెక్కిళ్ళలో 
చెమ్మలాగునా 

కన్నుపడ్డ కుచ్చిళ్ళలో 
కట్టు ఆగునా 

ఎదలే పండే ఏకాంతంలో