నేనే… తారలాగ వచ్చా నీ కోసం

చిత్రం: ప్రేమ శిఖరం (1992)
రచన: సిరివెన్నెల  
సంగీత: మనోజ్ భట్నాగర్   
గానం: బాలు, జానకి 

పల్లవి: 

ఏవో సరాగాలు పాడే
నా ప్రేమ 
నా జన్మ నా ఆత్మ
ఓహో హో ఆహా హా…

నేనే… తారలాగ వచ్చా నీ కోసం
నన్నే… ఆదుకున్న నీవే ఆకాశం
గంగే తలవంచి
శివగంగై కోరి వచ్చింది ఈ వేళ
మోడే చిగురించి కుసుమించే వలపులో

నేనే… తారలాగ వచ్చా నీ కోసం
నన్నే… ఆదుకున్న నీవే ఆకాశం
ఓ ఓఓ…
ఓ ఓఓ…

జుం జుం… జుంజుంజుం
జుం జుం జుం జుం

చరణం 1:

గున్నమావితోటల్లో 
కోకిలల్లె వచ్చావు
పాడలేని పాటల్లో 
పల్లవేదొ తెచ్చావు

ఓహో ఓహో ఓహో ఓహో ఓహో

వసంతాల వాకిట్లో… 
కొత్త పూలు చల్లావు
సుగంధాల ముద్దులతో 
సంతకాలు చేసి

అందాలన్నీ ఓ ఓ… ఓ ఓ 
ఆహ్వానాలే

బంధాలన్నీ ఓ ఓ… ఓ ఓ 
పేరంటాలే

వరుల విరుల తొలి మధుమాసం
తరలి వచ్చినది మన కోసం

కనులు గీటినది హరిచాపం
మనసు దాటినది తొలి తాపం
నేనే… తారలాగ వచ్చా నీ కోసం

చరణం 2:

లాలా ల లాలా ల
లాలా లాల లాలా లాల
లాలా లాల లాలా లాల లా లా.

అమావాస్య ఆకాశం 
జాబిలమ్మ ఉయ్యాలా
చీకటైన నా ప్రాయం 
వెన్నెలేసుకోవాలా

ఓహో ఓహో ఓహో ఓహో

హిమాలయ శిఖరంలో 
ప్రేమలేఖ రాయాలా
మరో సీత నీ కోసం 
లంక దాటి రాగా

వాక్యాలన్నీ… కావ్యాలైతే

ప్రాణాలన్నీ ఓ ఓ ఓ ఓ… 
గానాలేగా

చిలిపికనుల 
చెలి అనురాగం
పిలుపు తెలిపినది 
హేమంతం

చినుకు తారకల 
దరహాసం
చిగురు వేసినది 
ప్రియమాసం

నేనే… తారలాగా వచ్చా నీ కోసం

No comments:

Post a Comment

Leave your comments