ఈడొచ్చి పడ్డాది
నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి
రచన: భువనచంద్ర
గానం: చిత్ర, బాలు
పల్లవి:
ఈడొచ్చి పడ్డాది ఒడిలోనా....
ఎన్నీయల్లో ....
తోడొచ్చి తొంగుంట పిల్లదానా....
ఎన్నీయల్లో....
అడ్డుకుంది మోమాటం
ముడి విప్పమంది ఆరాటం
గోడమీది పిల్లివాటం
ఇక చాలు చాలు బుల్లో
చరణం 1:
పడుచు పైట అల్లరిగా పదేపదే తడుతుంటే
ఎన్నియలో ఎన్నియలో ఎన్నెలలో మల్లియలో
పొగరుమోతు చూపులతో మతే చెడీ పోతుంటే
కన్నియలో కన్నియలో కమ్ముకునే కోరికలో
పిలిచే ప్రతిపిలుపూ ఓలమ్మో వలపై బలపడితే
కరిగే ప్రతి నిమిషం ఓరబ్బా పెదవై కలబడితే
రాదారిలో గోదారిలా ఉప్పొంగనా నే భామా
చరణం 2:
ఒణికిపోయి ఒళ్ళంతా ఎడాపెడా ఒట్టెడితే
కన్నియలో కన్నియలో జివ్వుమనే గుండెలలో
ఒగిలిపోయే సిగ్గంతా చెడామడా జోకొడితే
ఎన్నియలో ఎన్నియలో పుచ్చుకునే ముద్దులలో
కొరికే చలికాలం బుల్లోడా పడనీ గదితాళం
ముదిరే వ్యవహారం బుల్లెమ్మా పెడతా తడిమేళం
వేధించుకో శోధించుకో సాధించుకో రా మామా