చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: మనో, జానకి
పల్లవి :
ఓ బేబీ.. నీ మీద బెంగపడ్డా
ఒళ్ళోకి రానివ్వు ఎంత చెడ్డా
మొగ్గేసెలే అందానికే
సిగ్గేసెలే పగ్గానికే
బీటేకొట్టేసి నా లైన్‌లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజుపడ్డా
నీతోనే నే కాలుజారిపడ్డా
ముద్దాడితే ముందుండనా
ముప్పూటలా తోడుండనా
లైటేతీసేసి నీ లైన్‌లో పెట్టుకో
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
చరణం 1:
నాకేమో పిచ్చాకలి...
తీరేది ఎట్టా మరి
ఒళ్ళంతా ఒకటే చలి...
తీరేనా ఈ రాతిరి
వలపు సలుపు రెండింతలై...
ఉడుకు దుడుకు రెట్టింపులై...
అడుగేసిందమ్మో నీ తోడు
నలిపేసిందయ్యో నా ఈడు...
కచ్చాపచ్చాగ కౌగిళ్లు కోరగా
ఓ బేబీ..
చరణం 2:
పైపైనే మోమాటము..
లోలోనా ఆరాటము
అంతేలే పోరాటము..
ఆడేలే కోలాటము
కలిసి కలిసి కవ్వింతగా...
వయసు సొగసు తుళ్ళింతగా
దులిపేసిందయ్యో నీ జోరు..
తొలిరోజుల్లోనే బేజారు...
నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా
ఓ బాబూ....
No comments:
Post a Comment
Leave your comments