Showing posts with label శివ గణేష్. Show all posts
Showing posts with label శివ గణేష్. Show all posts

రాగాలసిలకా

చిత్రం: పల్నాటి పౌరుషం (1994)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: మనో, సుజాత

సాకీ:

మేనత్త కూతురివే 
మెరుపంటి మరదలివే
మదిలోన మరులొలికే 
మరుమల్లె జాతరవే
పొట్టిజెళ్ళ పాలపిట్ట 
పైటకొచ్చెనెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక పున్నమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె నా మనసు ఆగేదెట్టా..ఆ

పల్లవి:

రాగాలసిలకా రంగేళిమొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
రాగాలసిలకా రంగేళిమొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా
జారుపైట వేసుకున్న జానపదమా..
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే

రాగాలసిలకా రంగేళిమొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

అస్కావా


అందని అందం అస్కావా
నీ మనసు నాకు తెలుసు (2003)
రెహమాన్
రత్నం, శివ గణేష్
శ్రేయా గోషాల్, సూర్జో భట్టాచార్య

పల్లవి :

తకదిమి తకదిమి త...
తకదిమి తకదిమి త...
ఏ ఓయ్ మా...
తకదిమి తకదిమి త...
తకదిమి తకదిమి త...
ఏ ఓయ్ మా...

పలికే గోరింకా చూడవే నా వంక



పలికే గోరింకా....
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
రచన: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేడే పూయులే

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా



నన్ను లాలించు సంగీతం నువ్వే
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004)
సంగీతం: ఎస్.ఎ రాజ్ కుమార్
సాహిత్యం: శివ గణేష్
గానం: ఉన్ని మీనన్ , సుజాత

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా
లేకా నేనే నువ్వా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

నెల్లూరి నెరజాణ



నెల్లూరి నెరజాణ
ఒకే ఒక్కడు (1999)
ఏ ఆర్ రెహమాన్
ఏ ఎం రత్నం, శివగణేష్
హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్

నెల్లూరి నెరజాణ 
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ 
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ 
నన్ను కొంచెం మార్చుకోవే

నెల్లూరి నెరజాణ 
నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ 
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ 
నన్ను కొంచెం మార్చుకోవే

రోజా... రోజా... ప్రేమికుల రోజు

రోజా... రోజా...
ప్రేమికుల రోజు (1999)
రెహమాన్
ఉన్నికృష్ణన్
ఏ.ఎమ్.రత్నం, శివగణేష్

రోజా... రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా..
నిను గాలిసోకగా వదలనులే..
నెలవంక తాకగా వదలనులే..
ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే..
నే ఓర్వనులే నే ఓర్వనులే..
రోజా రోజా...రోజా రోజా...
కన్నులలో కొలువున్నావులే..
రాతిరిలో కనులకు కునుకే లేదులే..
వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని..
నడుముకు కలుగును గిలిగిలి నా రోజా..
నీ పేరు నా నోట నే చెప్పగా..
నా ఇంట రోజాలు పూచేనులే..
నీ జాడ ఒకరోజు లేకున్నచో..
నీ చెలియ ఏదంటూ అడిగేనులే..
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే..
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం..
ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం..
తనువులే రెండు హృదయమే ఒకటి ...రోజా...రోజా...రోజా..
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా...

నవ యువతి నడుమొక గ్రంథము..
చదివైనా పలుచని రాత్రులు మంచులో..
దూరాలేలా జవరాలా బిడియాన్ని..
ఒకపరి విడిచిన మరి తప్పేముంది..
నన్నే నువ్వు తాకొద్దని..
గగనాన్ని ఆపేనా ఆ సాగరం..
నన్నే ముట్టుకోవద్దని..
చేతులకు చెప్పేనా ఆ వేణువు..
నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే..
కనులలో జారెడు అందాల జలపాతమా..
నన్ను నువు చేరగా ఎందుకాలోచనా..
నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు..
నా రోజా..రోజా..రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా..
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...

ఏరువాక సాగుతుండగా



ఏరువాక
ఒకే ఒక్కడు (1999)
రెహమాన్
స్వర్ణలత, శ్రీనివాస్
రత్నం, శివగణేష్

ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా

ఒకవైపు కన్నదిరే మరొ వైపు మేనదిరే
వీధుల్లో నిండిన కుండలు మ్రోగెను గంటలు ఏలనో
ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి ఆవొకటి కనిపించి
ఇక ఏమౌతుందో ఏటౌతుందో
ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో... ఓ
ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా

సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు
సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు

ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా...
నీ గుండె లోగిలనే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా...
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమింక మట్టిలో కలిసి పోయేవరకు ఓర్చును
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా...

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టే
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె కాలం మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ... ఓ... ఓ... ఓ...

హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా...
జీన్స్ (1998)
రచన: రత్నం, శివ గణేష్
సంగీతం: రెహమాన్
గానం: ఉన్ని కృష్ణన్, పల్లవి

నాకే నాకా నాకే నాకా
నువ్వు నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్‌లొచ్చిన శ్రీ కవిత నాకే నాకా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పూవా పుట్ట తేనా
నీ నడుం సగం తాకనివ్వవా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎరట్రి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్‌కూ సమాధి నిద్దర చెడగొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో.. ఉత్సాహమో..
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో.. ఆవేశమో..
పైర గాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

చెర్రి పూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐలవ్‌యూ
సైఫ్రస్ చెట్లలో దావో పక్షి నాతో అన్నది ఐలవ్‌యూ
నీ ప్రేమనే నువు తెలుపగ
గాలులు పక్షులు ప్రేమ పత్రమై కుమిలినవో
ఒంటి కాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే
పూమాలవో పూవెట్టనా
చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గలే ముద్దాడగా
నేను నిన్నూ ముద్దాడనా
హృదయ స్పందన నిలిచె నువు ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్విడిస్తే మరుక్షణం ఉండదు నాప్రాణం
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
హార్ట్ సైజు వెన్నెలలు నీకే నీకు
ఫ్యాక్స్‌లొచ్చిన శ్రీ కవిత నీకే నీకు
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
పట్టు పూవా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వవా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా

షకలక బేబీ


షకలక బేబీ
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: వసుందర దాస్, ప్రవీణ్ మణి, దేవన్

షకలక బేబీ షకలక బేబీ
షకలక బేబీ షకలక బేబీ
షకలక బేబీ షకలక బేబీ లుక్కులివ్వ తోచలేదా
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్య తోచలేదా

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
షకలక బేబీ షకలక బేబీ లుక్కులివ్వ తోచలేదా
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్య తోచలేదా

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు
షైయో షైయో షైయో షైయో
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
బబబ బబబబబ భయమేలా
దదద దదదదద దడయేల
లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల

నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
యే షకలక బేబీ షకలక బేబీ లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ్బా
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్య తోచలేదా

సాగర తీరంలో కాలే మండుటెండల్లో
మిట్టమధ్యాహ్నం మీటవుదాం హా... హా
ఒక కోకకోలాలో రెండు స్ట్రాలు వేసి సాయంకాలం దాకా తాగుతుందాం
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నా డ్రెస్సు మీద ఐస్ క్రీం వేసిపో
అది తుడిచేశాక్కూడా తాకిపో
షై యై యై యై యై యై యై యైయ్యా

ఫ్రైడే టెంపులికి తిసుకుపో
సాటర్ డే డిస్కొథెక్ తీసుకుపో
సండే టైటానిక్ తీసుకుపో తీ సు కు పో

న న న న న న న న న న న
న న న న న న న న న న న

షకలక బేబీ షకలక బేబీ లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్య తోచలేదా
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే
హత్తుకో ఎక్ దూజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
హే హే హే ఏమైందిరా మీకు

స్త్రీలంటే నీకు ద్వేషమా నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా
యంత్రానికి పుట్టినోడివా షైయో హోరే
ఆశ నీకు లేనే లేదా నువ్వు మీసం ఉన్న చెట్టు చేమవా హహహహహ
క్రీస్తుపూర్వం పుట్టినోడివా షైయో హోరే
లవ్వులో మునిగి లైఫంతా విసిగి గడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు
అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం ఓడిపోయాం
లవ్వులో పడితే లవ్వులో పడితే జీవితం సాగునులే సాగేనులే
లైఫులో గెలిస్తే లైఫులో గెలిస్తే అమ్మాయిలే వచ్చునులే వలచేనులే

షకలక బేబీ షకలక బేబీ లుక్కులివ్వ తోచలేదా
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్య తోచలేదే
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్య తోచలేదా
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లవ్
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లూస్
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లవ్
ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లూస్
ఏ పోయ్యా.... యు హావ్ సమ్ ఇగో...!

మగధీర


మగధీర
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్, యస్. జానకి

మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీరా...

మగధీర నన్నే చేకొనరా
నా పైటనెగరవేయ సమయమేదిరా
ఓ...
ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా
ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర
గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీర...
మగధీర...

మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీరా...

చరణం 1:

ఆ...ఆ...
శుభ ఘడియ చూసి
కురులు తీసి
పద్దు రాయర జబ్బపైనా
ఆ...
బంగారు కుంచె
తేనెలో ముంచి
సంతకం చేస్తా నీ గుండె పైన
లోకం కోసం నిధి పంచు
ఈ దేహం కోసం ఒడి పంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం
బలి కావడమే చెలి ధర్మం
ప్రియతమా...
ప్రియతమా నీకై వేచి ఉన్నా

మగధీర రా
మగధీర మగధీర రా
మగధీర మగధీర రా
మగధీర మగధీర
మగధీరా...

మగధీర నన్నే చేకొనరా
నా పైటనెగరవేయ సమయమేదిరా
ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా
ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర
గాజుల సవ్వడి వినుకోరా

మగధీర...మగధీర... హే...

చరణం 2:

గుడులెన్నో తెరచి
బడులు తెరచి
పడకగది చేర తీరిక లేదా
ఓ...
కలహాలు తీర్చి
చట్టాలు మార్చి
కౌగిలి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి
మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా
ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా...
ప్రణయమా నాపై దయ చూపమా

మగధీర రా
మగధీర మగధీర రా
మగధీర మగధీర రా
మగధీర మగధీర
మగధీరా...

మగధీర నన్నే చేకొనరా
నా పైటనెగరవేయ సమయమేదిరా
హే...ప్రేమ పిచ్చి పట్టీ
జతచేరా
ముద్దుల వర్షం
కురిపిస్తా
కత్తుల సవ్వడి
ఆగు వేళా
గాజుల సవ్వడి
నే వినుకుంటా

మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీరా...

అందాల రాక్షసివే



అందాల రాక్షసివే
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: హరిణి, యస్. పి. బాలు

అందాల రాక్షసివే
గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా రామ చిలకా
మొలకా ప్రేమ మొలకా

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే

సూర్యుణ్ణి  రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ...ఓ
చందురుణ్ణి కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ...
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ...ఓ
మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ...
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా
తలగడగా నాకొక్కా పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా
చిలకా రామ చిలకా
మొలకా ప్రేమ మొలకా

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే

కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుందాం
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుందాం

తేనెపట్టు పట్టుబట్టి పాడు చేయ శపథమా అహ...ఓ
ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ...
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ...ఓ
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే
చిలకా రామ చిలకా
మొలకా ప్రేమ మొలకా

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా

ఉట్టి మీద కూడు


ఉట్టి మీద కూడు
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి

యే... చంద్రముఖి...

హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ నాకు

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ హే...

ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

కొర్రమీను తుళ్ళే కాలువలో
రెళ్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు
తై తై తై తై తై
సరిగంగ స్నానాలు చేద్దామా
సిగ్గువిడిచి వెయ్ వెయ్
లై లై లై లై లై లై లై,
లై ల లై లై లై లై లై
పోకలు రాకలు కల్లేనోయ్
బ్రతికే నిమిషం నిజమేనోయ్
ఏ అరటిఆకున నిన్నే విందుగ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
అశే పాపం హాయ్ హాయ్ హయ్
చెవిలో గోల గోయి గోయి గోయి
పరువపు వయసు సేవలనీ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్

కోల అ కోల కోలగల,
కోల అ కోల కోలగల
కోల అ కోల కోలగల,
కోల కోల కోల కోల కోలగల

హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ నాకు

ఓ... చంద్రముఖి, చంద్రముఖి
ఓ... లై ల లై లై లై లై చంద్రముఖి

లేలే లేలే లేలే లే లేలే లేలే లేలే
లై లైలై లైలై లైలై లైలై లైలై లై లై

గాలి తప్ప దూరని అడవిలో
తుర్రుపిట్ట పిట్ట కట్టిన గూటిలో
ఒక రోజు నాకు విడిది చెయ్
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
నువు చీర దొంగిలించి పోయినా
పరువు నిలుపు నాచే
వలువలు అన్నవి కల్లేనోయ్
దాగిన ఒళ్ళే నిజమేనోయ్
వలువలు అన్నవి కల్లేనోయ్
దాగిన ఒళ్ళే నిజమేనోయ్
అంతటి అందం నాకే సొంతం
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
యెదలో రొదలె తై తై తై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే
హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నేను చాల నీకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనా నీకు

హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ హే...

ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

గోల అ గోల అ గోల గోలా