అఖిల చరాచర
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
గానం: ఉన్ని కృష్ణన్
రచన: శ్రీ వేదవ్యాస్
కృష్ణా.... ద్వారకావాసా
అఖిల చరాచర జగద్జాలముల అనాది అత్మల సాక్షిగా
అంతట నీవే ఉండీ లేవను ఉజ్వల భావం ఊపిరిగా
నింగీ నేలా నీరూ నిప్పూ గాలి కలయికల కాపరిగా
నీ ఆటే ఆటగ పాటే పాటగ సృష్టి స్థితి లయ,
విన్యాసలయల, ఆవల ఈవల అలరారే నీ లలితా
నృతరస లహరుల లీల, లీలాకృష్ణ చూపరా.
అమ్మకు చూపరా....
సరిగమ పమ రిస సరిమ,
మప నిద నిని స,
నిసరిప మపగమ రిస నిస రిస నిస రిస నిస నిప
వెన్న తిన్న ఆ నోటనే మన్ను తింటివట నోరు చూపరా
యని, తరిమిన తల్లికి పట్టుపడి
భక్తి పాశముల కట్టుబడి, మన్ను మిన్ను వెన్ను దన్ను
అన్నీ నేనే చూడమ్మా యని..
"ఆ" అని అమ్మకు అన్ని లోకాలు అవలీలగ చూపిన
ఆ లీల, లీలాకృష్ణ చూపరా.
అమ్మకు చూపరా....
చీరలెత్తుకుని చిటారుకొమ్మను కూర్చుని చేతులు ఎత్తి
మొక్కమని, గోపికా చిత్త హారుడవై,
చిరచిత్తుల తత్వము చెప్పితివి కదా..
సరి సమగమ నిద మద నిస నిద దని
దని రిస నిద మనిదమ గరిసని ద ద
మైత్రీబంధం మధుర మధురమరి చటుకున
అటుకులనారగించి పై పొరలు తొలగించి మోక్షమిచ్చు
పై వాడను నేనని చాటితివి కదా..
పదహారు వేల భామలతో, పరువాల అష్ట భార్యలతో
కూడినా అస్ఖలితబ్రహ్మచారివే కదా..
అందుకు చిహ్నంగానే శిరమున ధరించినావట నెమలి పించము.
అంతా గాలని చాటడానికే చేస్తావటగా వేణుగానము.
నువ్వే నేనని పార్థసారధిగ చూపినావుగా విశ్వరూపము
అడుగు అడుగులో ఆత్మ తత్వమును ప్రభోదించిన
పరమ గురు లీల,లీలాకృష్ణ చూపరా.
అమ్మకు మోక్షము నీయరా....
ఆ......