May 8, 2024

తెలుగు ఇంటి పెరటిలోన

చిత్రం: పరదేశి (1998)
రచన: చంద్రబోస్ 
సంగీతం: కీరవాణి
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర 

పల్లవి: 

తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా
చిగురుమావి గుబురులోని కుహుకుహూల రాగమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ 
దట్ ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ ఊరి గాలి మంచికబురు తెచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది

నయగారా దారుల్లో ఉరికే జలపాతమా
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ 
దట్ ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్నిమాట నాకు భలే నచ్చింది
ఇంత వరకు లేని హాయి తెలిసొచ్చింది


చరణం 1:

జూలియెట్టు రోమియోల జంటలేల మనది

నల దమయంతిలోని పంతమే ఇది

డ్రీము లాండు నేల మీద ప్రేమ కాండ మనది

యదుకుల వీధిలోని ప్రణయమే ఇది

దేశం మారినా 
ప్రేమరసం ఒక్కటే

కాలం మారినా 
కన్నెతనం ఒక్కటే

చనువే పెరిగినా తనువే మరిగినా

సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే

వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా

పడమరమ్మ నుదుటి పైన మెరిసే సిందూరమా

చరణం 2:

ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం

మధువుల ముంచు ఫ్రెంచిముద్దులే సుమా

సీమరాణి రామరాజు దగ్గరైన తరుణం

మనువుకు గ్రీనుకార్డు సిద్దమే సుమా

అథిదిగా వచ్చినా 
అమృతమే ఇవ్వనా

హృదయం అర్చన 
ఈ క్షణమే చెయ్యనా

కరగని కాంక్షతో వదలని దీక్షతో

వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన

విజయనగర వీధుల్లో మెరిసే రవికిరణమా

వాషింగ్టన్ డి సి లో కురిసే హిమచైత్రమా