March 8, 2020

స్నేహితుడే ఉంటే..


స్నేహితుడే ఉంటే..
నీ మనసు నాకు తెలుసు (2003)
చిన్మయి, మనో, ఉన్నికృష్ణన్
ఎ. ఆర్. రెహమాన్
రత్నం, శివగణేష్

స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమామన పేరు దిక్కులలో చాటుదాం
నదులు కడలికే అంకితం
మన తనువు చెలిమికే అంకితం
చెలిమి మాకు ఒక చిరునామా
మా జీవితాలకే వీలునామా
ఈ జగతిలోనే నిరుపేదా
మిత్రుడు లేని వాడు....హే
స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో చాటుదాం

చరణం 1:

భుజాన చేతులు వేసి
తోచింది మాట్లాడుకుంటూ
ఊరు తిరిగి వచ్చాం వచ్చాం
కలిసి చదువుకుని నిదురపోతిమి
చెలిమి దుప్పటిలో
మన జీవితాన ప్రేమలూ
అందాల కలువలే
స్నేహమన్న బంధమేమో
కలుపును మనకే
ఊపిరిలో
స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో చాటుదాం

చరణం 2:

గుండెల్లో గుండెల్లో ఉన్న
మాటల్ని మాటల్ని చెప్ప
నేస్తం ఒకటే సొంతం
కలిసి కూర్చుని తినే తిండిలోనే
ఉంది స్నేహం రుచి
అరే... జీవితపయనం మారినా
స్నేహం మారునా
ఆయుర్దాయం తీరినా
మిత్రుని రూపం చెరిగేనా
స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో చాటుదాం
నదులు కడలికే అంకితం
మన తనువు చెలిమికే అంకితం
చెలిమి మాకు ఒక చిరునామా
మా జీవితాలకే వీలునామా
ఈ జగతిలోనే నిరుపేదా
మిత్రుడు లేని వాడు....హే