Showing posts with label డాడీ (2001). Show all posts
Showing posts with label డాడీ (2001). Show all posts

నా ప్రాణమా సుస్వాగతం

నా ప్రాణమా సుస్వాగతం
డాడీ (2001)
మణిశర్మ
సిరివెన్నెల
ఉదిత్ నారాయణ్, చిత్ర

గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం
అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టాననీ నా ఊపిరన్నది
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప

చరణం 1:

నడి రేయే నిలవదుగా
వెన్నెలగా నువ్వు నవ్వతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి
ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా..నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం

చరణం 2:

ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా
సంకోచం తీర్చగా ముద్దుబాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా
నీలో లీనమై నేనే  నీవనిపించేలా
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది

నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకోసమే పుట్టాననీ నా ఊపిరన్నది
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప