November 4, 2024

గుసగుసలే గున్నామామిళ్ళో

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత  
రచన: వేటూరి 

పల్లవి : 

గుసగుసలే గున్నామావిళ్ళో  
అన్నీ రుసరుసలే కన్నెచూపుల్లో

చిటికెడులే చిరుముద్దుల్లో 
అన్నీ పిడికెడులే పిల్లా సిగ్గుల్లో

యా యా సౌందర్య 
ఇది నిజమా యాయా

అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా

ఎదకొరిగి ఎన్నో బింకాలా
రుచిమరిగీ ఇంకా ఇంకాలా

హొయ్ చెమటలతో చెంగే పంఖాలా
హొయ్ సుఖపడుతూ కట్టే సుంకాలా 

గుసగుసలే గున్నామావిళ్ళో  
అన్నీ రుసరుసలే కన్నెచూపుల్లో

చరణం 1:

కడవ చిన్న నడుము కున్నా కదలికలెన్నో
తనే దులుపుకుంటాడే 
అదే వలపు అంటాడే

ఇప్పుడు వద్దు  అప్పుడు వద్దు 
కధకళితోనే ఏదో దరువేస్తుంది 
తనే దరి కొస్తుంది

పదరా ఆపదరా అని మెలికేస్తుంటే

పదరా పూపొదకే అని సై అన్నట్టే 

పదరా ఆపదరా అని మెలికేస్తుంటే

పదరా పూపొదకే అని సై అన్నట్టే 

చెలి సలహా పస్తేనంటాడు 
అమ్మో చలి విరహాలొస్తాయంటాడు

అది మినహా అన్నీ తయ్యారే 
అబ్బా కలహాల కన్యాకుమారీ

చరణం 2:

నడక భలే నెమలి వలే ఒడికొస్తూనే 
ప్రియా పిలిపుస్తుంది 
లయే కలిపేస్తుంది

మురళివలే స్వరములిలా వాయిస్తూనే
బుగ్గే దాచుకుంటుంటే 
మొగ్గే దోచుకుంటాడు

తగునా ఓ మదనా ఈ తగవంటుంటే 

తగనా ఓ లలనా ఈ జతకంటాడు

తగునా ఓ మదనా ఈ తగవంటుంటే 

తగనా ఓ లలనా ఈ జతకంటాడు

చలిపెడితే సలామాలేఖుం 
సెగపుడితే జలాభిషేకం

మనకేస్తే మరో ప్రపంచం 
అబ్బా ఉడుకొస్తే ఉయ్యాలమంచం 

గుసగుసలే గున్నామావిళ్ళో