మన శంకరవరప్రసాద్ గారు (2026)
గాయకులు: ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కరభట్ల
పల్లవి:
హే మీసాల పిల్లా..
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
మీసాల పిల్లా..
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
పొద్దున్ లేచిందగ్గర నుంచీ డైలీ యుద్ధాలా?
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా?
అట్లా కన్నెర్ర జెయ్యలా..
కారాలే నూరేలా
ఇట్టా దుమ్మెత్తిపొయ్యలా..
దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే..
చిరుతకి చెమటలు పట్టేలా
నీ వేషాలు చాల్లే..
నువ్ కాకాపడితే కరిగేటంత సీనేలేదులే
అందితె జుట్టూ.. అందకపోతే కాళ్ళబేరాలా
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..
ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముళ్ళు గుచ్చి
పువ్వులు చేతికి ఇస్తారా..?
మీసాల పిల్లా..