శ్రీయుతమౌ శ్రీరామ పాదం
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: ఆరుద్ర
గానం:: సుశీల, వసంత
పల్లవి::
శ్రీయుతమౌ శ్రీరామ పాదం..
శ్రితజన మందారం
పావనమీ రఘురామపాదం..
పాప వినాశకరం
చరణం 1:
కలుషమ్ముల ప్రక్షాళన చేసి..
గంగ జనించిన పాదం
అసుర మదమ్మును పాతాళానికి..
అణచివేసిన పాదం
రాతిని నాతిని చేసిన పాదం..
అడవికి అందం పోసిన పాదం
ఈ చరణమ్మే శరణమ్మనగా..
యిచ్చును పెన్నిధానం
శ్రీయుతమౌ శ్రీరామపాదం..
శ్రితజన మందారం
పావనమీ రఘురామపాదం..
పాప వినాశకరం
చరణం 2:
అవలీలగ జలధిని దాటిన మేటి..
పవన కుమారుడు పట్టే పాదం
బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం..
పరబ్రహ్మపదానికి మూలం
తాను ధరించిన పాదుకలకు..
ధర పట్టం కట్టిన పాదము
తమ్ముడు భరతుని తరతరాలకు..
ధన్యుని చేసిన పాదం
శ్రీయుతమౌ శ్రీరామపాదం..
శ్రితజన మందారం
పావనమీ రఘురామపాదం..
పాప వినాశకరం