December 18, 2023

కళ్యాణ వైభవమీనాడే

కళ్యాణ వైభవమీనాడే 
చిత్రం : శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ 
గానం : జిక్కి, పి.లీల

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

చూతమురారే సుదతులందరూ
చూతమురారే సుదతులందరూ
చేతమురారే సింగారాలు 
కళ్యాణ వైభవమీనాడే
 
పసుపు కుంకుమ అలదండీ 
పచ్చని తోరణాల్ కట్టండీ 
పసుపు కుంకుమ అలదండీ 
పచ్చని తోరణాల్ కట్టండీ 
రంగురంగులా రత్నాలు కలిపీ
ఆఆ...ఆఆఅ...ఆఆఅ....ఆ... 
రంగురంగులా రత్నాలు కలిపి
ముత్యాల ముగ్గులు వేయండి 

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

అతివ కోరిన వరుడు 
అతిలోక సుందరుడోయమ్మా
అతగానికన్నింట జతయౌను 
మా యమ్మా ఆహూ.. ఆహూ..
అల్లారు ముద్దుగ 
పెరిగింది మాపిల్ల ఓయమ్మా
పువ్వుల్లో పుట్టాడు 
మా పిల్లవాడమ్మా ఆహూ.. ఆహూ.. 
 
చిలకలకొలికీ పద్మావతికీ 
కులుకే సింగారం
చెలి గుణమే బంగారం
మా చిలకలకొలికీ పద్మావతికీ 
కులుకే సింగారం 
చెలి గుణమే బంగారం

నవలామణికి నగవుల గనికి 
మనసే లావణ్యం లే వయసే వయ్యారం 
చక్కని చెక్కిలి చుక్కెందులకే.. ఎందుకే
చందమామలో నలుపున్నందుకే.. ఆహా
చిన్నదానికి ఆ సిగ్గెందులకే 
అవును ఎందుకే 
మనసులోన మరులున్నందులకే

చల్లనైన తల్లివి శంకరుని రాణివి
చల్లనైన తల్లివీ శంకరుని రాణివీ
దీవనలే ఇవ్వవమ్మా దేవేరి జయగౌరి 
చల్లనైన తల్లివీ శంకరుని రాణివీ
చల్లనైన తల్లివీ 

పసిడి కలల బాల తన పరిణయ శుభవేళా 
పసిడి కలల బాల తన పరిణయ శుభవేళా 
ప్రణమిల్లెను బ్రతుకెల్లను పచ్చనైన పంటగా
దీవనలే ఇవ్వవమ్మా దేవేరి జయగౌరీ