December 18, 2023

చిగురాకుల్లో చిలకమ్మత్త

చిగురాకుల్లో చిలకమ్మత్త
చిత్రం: జడగంటలు (1984)
సంగీతం: పుహళేంది
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల

పల్లవి: 

డింగ్ డాంగ్ ...
చిగురాకుల్లో చిలకమ్మత్త,
పూరేకుల్లో తుమ్మెదమామా 
విన్నారా..? 

కొమరాఁకల్లో గోరింకయ్యో,
కొండాకోనల గోదారమ్మో 
విన్నారా..? 

చిగురాకుల్లో చిలకమ్మత్త,
పూరేకుల్లో తుమ్మెదమామా 
విన్నారా..? ఇది విన్నారా..? 

కొమరాఁకల్లో గోరింకయ్యో,
కొండాకోనల గోదారమ్మో 
విన్నారా..? ఇది విన్నారా..?

పెళ్ళి నాపెళ్ళి నాపెళ్ళి పెళ్ళి పెళ్ళి 

చరణం 1: 

వచ్చేది మాఘమాసం పంచమినాడే సుముహూర్తం 
ఈ కన్నె కళ్యాణానికి వన్నెచిన్నె మా కట్నం
నా పెళ్ళిపందిరి ఆకాశం 
చిరునవ్వు, సిగలో పువ్వు దంపతులైతే ఆనందం 
శ్రీరస్తు శుభమస్తంటూ చిలికేరమ్మ శ్రీగంధం 
మీరంతా ముత్తయిదువులై రావాలంటా పేరంటం 
రావాలంటా పేరంటం...
రావాలంటా పేరంటం...
పెళ్ళి నాపెళ్ళి నాపెళ్ళి పెళ్ళి పెళ్ళి 
డింగ్ డాంగ్ ...

ఎండలు పుట్టే కొండల్లారా, కొండలనెక్కే చుక్కల్లారా 
విన్నారా..? 
మాగాణుల్లో పంటల్లారా, దేవుడి గుళ్ళోగంటల్లారా 
విన్నారా..? 

ఎండలు పుట్టే కొండల్లారా, కొండలనెక్కే చుక్కల్లారా 
విన్నారా..? ఇది విన్నారా..?
మాగాణుల్లో పంటల్లారా, దేవుడి గుళ్ళోగంటల్లారా 
విన్నారా..? ఇది విన్నారా..?
పెళ్ళి నాపెళ్ళి నాపెళ్ళి పెళ్ళి పెళ్ళి 

చరణం 2: 

మగపెళ్లివారమంటూ మధుపర్కాలే తెస్తారా 
మాఇంట్లో పెళ్ళికి మీరు మంగళవాద్యం తెస్తారా 
మా పెళ్ళిపండగ నూరేళ్ళూ 
నీలాల చుక్కను తెచ్చి బుగ్గన చుక్క పెడతారా?
పల్లకిలో మెడనే వంచి పెళ్ళికి వేడుక చూస్తారా 
ఏడేడు జన్మలదాకా ఎదగాలంట సంసారం 
ఎదగాలంట సంసారం 
ఎదగాలంట సంసారం 

పెళ్ళి నాపెళ్ళి నాపెళ్ళి పెళ్ళి పెళ్ళి 
డింగ్ డాంగ్ ...

జతకట్టే జడగంటల్లారా, జతులాడే సిరిమువ్వల్లారా 
మీ పెళ్ళి
పల్లెల్లోనా పడుచుల్లారా, కులికే కుంకుమభరిణెల్లారా 
వస్తారా
  
జతకట్టే జడగంటల్లారా, జతులాడే సిరిమువ్వల్లారా 
మీ పెళ్ళి ఇది మీ పెళ్ళి
పల్లెల్లోనా పడుచుల్లారా, కులికే కుంకుమభరిణెల్లారా 
వస్తారా... మీరొస్తారా...!
పెళ్ళి నాపెళ్ళి నాపెళ్ళి పెళ్ళి పెళ్ళి