December 18, 2023

పిల్లి మద్దెల వాంచెనమ్మా

పిల్లి మద్దెల వాంచెనమ్మా
జానపదగీతం
సంగీతం: జి. ఆనంద్ 
గానం: రాళ్ళపల్లి 

పల్లవి: 

పిల్లి మద్దెల వా(యిం)చెనమ్మా      
చిట్టెలుక శోభనం పాడెనమ్మా 

గాదె కింద రెండు గడబిడ కొక్కులు 
కడుపు నొస్తందని ఏడ్చెనమ్మా 

చరణం 1: 

సెరువులో ఉండేటి సేప పిల్లలు రెండు 
సిలుకు సిలుకుమని సిలికేనమ్మా 

గడ్డమీదుండేటి గుడ్డి కొంగలు రెండు
ముద్దు పెడతానని పిలిచేరమ్మా 

చరణం 2:

కుంటలో ఉండేటి తోక కప్పలు రెండు 
కులికి కులికి నాట్యం చేసెనమ్మా 

పండక్కి రమ్మని పుట్ట నాగుపాము 
పట్టుపురుగులు చూపి పిలిచేరమ్మా 

చరణం 3:

మేకపిల్లలు రెండు మేళాలు పట్టుకోని 
యాడికి సంతకి పోయెనమ్మా 

తోడేలు నాథుడు తోవకడ్డమొచ్చి 
పెండ్లికి రమ్మని పిలిచేనమ్మా 

చరణం 4:

సెట్టుమీదుండేటి గువ్వపిట్టలు రెండు 
పాట పాడుతు రాగం తీసేనమ్మా 

డేగ గద్దలు రెండు రాగం బాగుందని 
పేరంటం రమ్మని పిలిచేరమ్మా