సాకేత సార్వభౌమ
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం:: మహదేవన్
రచన:: గబ్బిట వెంకటరావు
గానం:: ఈలపాట రఘురామయ్య
పల్లవి:
రామా..
తగునా..
నీ దాసుపైన రణభేరివేయ..
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..
శరణు శరణయా జానకి రామ
కరుణజూపవా మారుతిపై
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..
చరణం 1:
కలనయినా నిను కొలిచే నేను కయ్యానికెటులోడ్తురా
రాచరికానికి హృదయమె లేదా నెయ్యనికెడమీయదా
ప్రేమనిధానా న్యాయమిదేనా
ప్రేమనిధానా న్యాయమిదేనా
ఇంకేల ఈ శోధనా
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..
చరణం 2:
భక్తుల బ్రోచే వరదుడవీవే భారము నీదెనయా
ఏమరినావా చెసిన సేవ నా మొరనాలింపవా
దాసుని దోసం దండముతో సరి
దాసుని దోసం దండముతో సరి
దండనమేలనయ
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..
శరణు శరణయా జానకిరామ
కరుణజూపవా మారుతిపై
సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమా..
రామా..