మేళతాళాలతో వేదమంత్రాలతో
చిత్రం: జీవితంలో వసంతం (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
మేళతాళాలతో వేదమంత్రాలతో
రేపు కళ్యాణవైభోగమే
కన్నె తోలి నోములే కోటి విరిజల్లులై
కలలు పండేనులే
చరణం 1:
కళకళలాడే కస్తూరి తిలకం
కనువిందు చేసే పారాణి అందం
మొగలిరేకుల వాలుజడలో
సిగ్గులొలికే బుగ్గచుక్కలో
మనసారా చేయాలి గౌరీపూజ
ఆ తల్లి ఇవ్వాలి సౌభాగ్యశోభ
చరణం 2:
కళ్యాణసాక్షి దివ్యాగ్నిహోత్రం
పుణ్యానుబంధం మంగళసూత్రం
మూడుముడుల రాగబంధం
ఏడు అడుగుల జీవనమార్గం
వేస్తారు పెద్దలు అక్షింతలు
దీవెనలు కావాలి లక్షింతలు
చరణం 3:
తెలిసీ తెలియని వలపుల తలపులు
విరిసీ విరియని విరజాజి పూలు
అందచందాలు శ్రీవారికి
అంకితమియ్యాలి ఈ శుభవేళ
మరలా రానిది ఈ తొలిరేయి
మధురము కాబోలు ఈనాటి హాయి