December 18, 2023

రా రా ఓ రాజా

రా రా ఓ రాజా 
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: సినారె 
గానం:: జానకి 

పల్లవి::

రా రా ఓ రాజా 
రా రా ఓ రాజా 
చలచల్లనీ దినరాజా 
నులివెచ్చనీ నెలరాజా 
సుందర ప్రణయమందిరా 
సుగుణ బంధురా 
మునుముందర కౌగిలి విందురా 
ఇందిరా పొందరా 
రా రా ఓ రాజా

చరణం 1:

ఆ చిగురుల సొంపులే నా పెదవుల కెంపులు 
ఆ విరిసిన పువ్వులే నా వెన్నెల నవ్వులు 
ఆ చిలకలే నా పలుకులు 
ఆ కోకిలలే నా గీతికలు 

ఆ చిలకలే నా పలుకులు 
ఆ కోకిలలే నా గీతికలు 

వన మయూరాలు నా వయ్యారాలు 
నవవసంతాలు నా దృగంతాలు 

ప్రకృతి నేనై పురుషుడవీవై 
ప్రకృతి నేనై పురుషుడవీవై
వరించి రమించి జయించి తరించరావే 
ఓ రాజా

చరణం 2:

రతిరాజు కోరేది రక్తి 
యతిరాజు కోరేది ముక్తి

రతిరాజు కోరేది రక్తి 
యతిరాజు కోరేది ముక్తి

ఆ రక్తియే ఈ రంభయై 
ఆ ముక్తియే పరిరంభమై 
పరలోక బంధాలు తెంచుకో 
రసరాగ బంధాలు పెంచుకో 

మునులు ఘనతపోధనులు పొందనిది 
ముందే ఉందని తెలుసుకో 
నీ ముందే ఉందని తెలుసుకో
నాయందే ఉందని తెలుసుకో
ఆ..
నీ ముందే ఆ.. నీ ముందే ఆ.. నీ ముందే నీ ముందే
నీ ముందే నాయందే ఉందని తెలుసుకో...