నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
చిత్రం: మ్యాడ్ (2023)
రచన: శ్యామ్ కాసర్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
గానం: భీమ్స్, కీర్తన, వరం
పల్లవి:
హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్ర రోజాపువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు
అరె పడితె లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ వోతది
అది పోతే ఇంకోతొస్తది
హే నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ వోతది
అది పోతే ఇంకోతొస్తది
హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్‌ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు
అరె ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడూ
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
చరణం 1:
హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగిలని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నా.. దాని ఫ్రెండును ట్రై చేస్తారు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
ఆ ఎడ్డీ పోరల్ల చేసి ఆడిపిస్తరూ
నడిసినన్ని రోజులూ నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులూ నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
చరణం 2:
హే... ఫస్టులవ్వు ఎప్పుడూ బెస్టు జూడు
ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి జూడు
నిబ్బానిబ్బి టైపు లవ్వు వదిలి జూడు
బ్రేకప్పయితే ఎవరికైనా నొప్పే జూడు
ఫ్రెండు అంటే ఫ్రెండురా
లవ్వు అంటే లవ్వురా
లవ్వు చేస్తే లైఫులో అస్సలొదులుకోకురా
ఫ్రెండు అంటే ఫ్రెండురా
లవ్వు అంటే లవ్వురా
లవ్వు చేస్తే లైఫులో అస్సలొదులుకోకురా
అరె సోది చెప్పకుండ సోల్‌మేటు కొరకు ఎతుకురా
ఫ్రెండు అంటే ఫ్రెండురా
లవ్వు అంటే లవ్వురా
లవ్వు చేస్తే లైఫులో అస్సలొదులుకోకురా
ఫ్రెండు అంటే ఫ్రెండురా
లవ్వు అంటే లవ్వురా
లవ్వు చేస్తే లైఫులో అస్సలొదులుకోకురా