ఆనందమౌనమ్మా
చిత్రం: శకుంతల (1966)
రచన: సముద్రాల
సంగీతం, గానం: ఘంటసాల
కణ్వుడు:
గురుజనముల వినయముతో కొలువుమా
సిరిగని పొంగకుమా
పరిజనులను కరుణతో కనుమా
పతి అలిగిన నీవలుగకుమా
ప్రియభాషిణివై పరిచర్య సేయుమా
ఈ గతిన చరించిన సతియే
పతివ్రతయౌనమ్మా
కోరస్:
ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మా
అత్తవారింటికి పోయిరావమ్మా
కణ్వుడు:
మీ కన్నులలో వెన్నెలయై మీ తెన్నుల పెరిగినదీ
ముందు మీకే నీరు పోసి పిదప తాను త్రాగినదీ
మీ సొగసే తన సొగసుకన్న మిన్నగా తలచినదీ
మనల విడిచి మగనింటికి కదలేను శకుంతలా
మనసార దీవించరమ్మ లత లారా వనదేవతలారా
తల్లిలేని పసికూనను చేరదీసి పెంచితివి
నీ చెలిమిని మరువలేక
నిన్ను వదలి మనలేక
ఈ హరిణము నిను చూచేను
జాలిగా.... కన్నీటి జాలుగా